గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 5 డిశెంబరు 2021 (10:32 IST)

ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు... అధికారుల్లో ఆందోళన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా మరో 186 మందికి ఈ వైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అదే సమయంలో కరోనా వైరస్ సోకి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
 
సౌతాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ అయిన ఒమిక్రాన్ ప్రపంచాన్ని వణికిస్తుంది. ఈ వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. భారత్‌లోనూ ఈ కేసులో నమోదయ్యాయి. దీంతో అన్ని విమానాశ్రయాల్లో హైఅలెర్ట్ ప్రకటించారు. విదేశాల వచ్చే వారిపై కఠిన ఆంక్షలు విధించారు.
 
ఈ నేపథ్యంల ఏపీలో పాజిటివ్ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తుంది. గత 24 గంటల్లో కొత్తగా 186 మందికి వైరస్ సోకినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం 32,036 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఈ క్రమంలో ఈ నెల 3వ తేదీన 138 కేసులు నమోదు కాగా కొత్తగా 186 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.