బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 3 డిశెంబరు 2021 (13:56 IST)

పీఆర్సీపై శుభవార్త చెప్పిన సీఎం జగన్ - 10 రోజుల్లో ప్రకటన

ప్రభుత్వ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కారు శుభవార్త చెప్పింది. పీఆర్సీపై ప్రక్రియ పూర్తయిందని మరో వారం పది రోజుల్లో ఒక ప్కరటన ప్రకటన చేస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. 
 
ప్రస్తుతం ఆయన వరద బాధిత జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా రెండో రోజు అయిన శుక్రవారం చిత్తూరు జిల్లా పర్యటనను ముగించుకుని నెల్లూరుకు వెళ్లారు. 
 
అంతకుముందు. ఆయన తిరుపతి సరస్వతి నగర్‌లో ఉద్యోగుల తరపున కొందరు ప్రతినిధులు సీఎం జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా వారు పీఆర్సీపై ప్రక్రియ పూర్తి చేసి త్వరగా ప్రకటించాలని కోరారు. 
 
దీనిపై సీఎం జగన్ స్పందిస్తూ, పీఆర్సీ ప్రక్రియ పూర్తయిందని, వారం పది రోజుల్లో దీనిపై ఒక ప్రకటన చేస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఆయన నెల్లూరు జిల్లాలోని వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించేందుకు బయలుదేరి వెళ్లారు.