శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 17 నవంబరు 2016 (09:01 IST)

గాలి కూతురి వివాహం.. బీజేపీకి తలనొప్పి.. హాజరైన తమన్నా, బ్రహ్మీ, సుమన్.. 50000 మంది అతిథులు..

కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి కుమార్తె బ్రహ్మణి వివాహం బుధవారం అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే ఈ పెళ్లికి టాలీవుడ్, బాలీవుడ్ తారలు హాజరయ్యారు. రూ.17కోట్ల విలువైన చీరతోనేకాకుండా, దాదాపు 90

కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి కుమార్తె బ్రహ్మణి వివాహం బుధవారం అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే ఈ పెళ్లికి టాలీవుడ్, బాలీవుడ్ తారలు హాజరయ్యారు. రూ.17కోట్ల విలువైన చీరతోనేకాకుండా, దాదాపు 90కోట్ల రూపాయల విలువైన బంగారు నగలతో పెళ్లిమండపం తళతళలాడితే, దాదాపు రూ.500 కోట్ల రూపాయల బడ్జెట్‌తో ఈ పెళ్లి జరిగిందన్న ప్రచారం జోరుగా ఉంది.
 
అయితే, గాలి కుటుంబం మాత్రం ఖర్చు రూ. 50కోట్లుగా చెబుతోంది. ఇవన్నీ ఒకెత్తయితే, మైనింగ్ మాఫియా ఆరోపణలు ఎదుర్కొని అనేక కేసుల్లో నిందితుడుగా ఉన్న గాలి జనార్థనరెడ్డి పిలిచిన పిలుపుకు పెద్దలు హాజరు కాలేదని తెలిసింది. అయితే గాలి పెళ్లిలో కనిపించిన టాలీవుడ్ సెలబ్రెటీలు కనిపించారు. బ్రహ్మానందం, సుమన్, సాయికుమార్, విశాల్ పెళ్లికి హాజరైనట్టు తెలుస్తోంది. రాజకీయపరంగా బీజేపీ సీనియర్ నేత జగదీష్ షెట్లర్ కూడా పెళ్లికి హాజరై నూతన వధువరుల్ని ఆశీర్వదించారు.
 
కాగా.. భారతీయ జనతా పార్టీ నాయకుల వద్ద నల్లధనం ఉందని, అలా ఉందని చెప్పడానికి కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి కూతురు పెళ్లే నిదర్శనమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంత రావు ఆరోపించారు. ఇలా గాలి పెళ్ళిపై ప్రతిపక్షాలు బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇక ఈ పెళ్లికి 50వేల మంది అతిథులు హాజరైనట్లు తెలుస్తోంది.