1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By దేవీ
Last Updated : గురువారం, 1 మే 2025 (20:00 IST)

నాని హిట్3, సూర్య రెట్రో సినిమాల్లోనూ కామన్ పాయింట్స్ హైలైట్స్

Hit 3 - Retro
Hit 3 - Retro
యాద్రుశ్చికమైనా, మేడే నాడు విడుదలైన రెండు సినిమాల్లోనూ కొన్ని కామన్ పాయింట్స్ గోచరిస్తాయి. తెలుగులో నాని నటించిన హిట్-3 ది థార్డ్ కేస్. తమిళంలో సూర్య నటించిన రెట్రో సినిమా. హిట్ 3 సినిమాను, నాని, ప్రశాంతి త్రిపురనేని నిర్మించారు. రెట్రో సినిమాను సూర్య, జ్యోతిక నిర్మాతలు. రెండు చిత్రాల్లోనూ కథాపరంగా వయెలెన్స్ చాలా ఎక్కువగానే వున్నాయి. హింస, రక్తపాతం బాగా ఇష్టపడే ఓ వర్గం కళ్ళెదుట కత్తులతో ఫైట్ చేస్తూ పొడుచుకుంటూ చనిపోతుంటే హ్యాపీగా ఎంజాయ్ చేయడం అనే అంశం కామన్ గా వున్నాయి.
 
నాని హిట్ 3 సినిమాకు మూలకథ గతంలో కొన్ని దేశాల్లో జరిగిన డార్క్ వెబ్ సైట్ పేరుతో క్రూరంగా మనిషిని కసకసా గొంతులు కోసి చంపుతూ వీడియోలు తీసి పైశాకిక ఆనందం పొందడం. అలా చేస్తే ఆ క్లబ్ లో మెంబర్ అవుతారు.వారంతా  ఏడాదికి ఓసారి కలిస్తే, అక్కడ జరిగే హింస మామూలుగా వుండదు. ఆఖరికి 9నెలల పాపను కూడా ఎలా హత్య చేయాలో కూడా చూపించే ప్రయత్నం చేశారు. డార్క్ వెబ్ సైట్ ముఠా సి.టి.కె. పేరుతో (క్యాచ్ టార్చర్ కిల్లింగ్) చేసే హింస మామూలుగా వుండదు. దానికి తట్టుకుని అలాంటి హింసాత్మక ధోరణి వుండాలంటే హెచ్.ఐ.టి. (హిట్) పేరు పోలీస్ ఆఫీసర్ లాంటి వుండాలనేది నాని చూపించాడు. అందుకు విదేశాల్లో జరిగిన ఉదంతాలను పేపర్ కటింగ్స్ చూపిస్తూ, భారత్ దేశంలో పలుచోట్ల ఇలా జరుగుతున్నాయంటూ.. మనిషిని చంపాక వారిలో పార్ట్ ను విదేశాల్లో వారికి అమ్మేయడం వంటి అంశం కూడా ఇందులో వుంటుంది. 
 
ఇక రెట్రోీ సినిమాలోనూ అంతకుమించి హింస వుంటుంది. 1960లో అండమాన్ ప్రాంతంలో రాజులు, బ్రిటీష్ వారు చుట్టుపక్కల ప్రజల్ని కిడ్నాప్ చేసి బానిసలుగా దీవుల్లో వుంటూ చాకిరీ చేయించుకోవడమేకాకుండా, వారిలో వారికి యుద్ధం లాంటి పోరాటాలు చేయిస్తూ ఓడిన వారిని క్రూరంగా చంపేయడం, కసకసా కత్తితో గొంతులు కోసేయడం, లేదా ముసళ్లకు ఎరగా వేయడం జరుగుతుంది. ఈ ప్రోసెస్ లో ఆ దీవిలో ఇదో ఆటగా భావించి బానిసలు రక్తంకారేట్లు కొట్టుకుంటూ వుంటే చూసి ఎంజాయ్ చేయడం వంటి విక్రుత చేష్టలు కనిపిస్తాయి. ఈ సినిమాలోని అంశాలు లోగడ చాలా హాలీవుడ్ సినిమాలు వచ్చాయి. టెన్ కమాండ్ మెంట్స్ పేరుతో పలు సినిమాలు బానిసలతో జరిగే యుద్ధం అందరూ వెండితెరపై చూసిందే. 
 
ఇలా రెండు సినిమాల్లోనూ అంశం హింస, రక్తపాతం, పైశాచిక ఆనందం పొందడం బ్యాక్ డ్రాప్ కూడా విదేశాల్లో జరగడం వంటి అంశాలను టచ్ చేయడం వంటివి ప్రధానమైన పాయింట్లు. అందులో భాగంగానే వర్తమానంలో దర్శక నిర్మాతలు, హీరోలు కూడా చిత్రాలలోని కథా వస్తువు కాలం వెనక్కి వెళ్ళి దర్శకులు తమకు అనుకూలంగా రాసుకుంటూ, ప్రజల్లో వయెలెన్స్ కు ప్రజలు బానిసలుగా మార్చే ప్రయత్నం చేయడం విశేషం.

డైరెక్టర్  వాల్యూస్, రూల్స్ 
అసలు సినిమా దర్శకులు కూడా డైరెక్టర్  వాల్యూస్, రూల్స్ ను సరిగ్గా పాటించడంలేదని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఒకరకంగా  చెప్పాలంటే అతిక్రమించుతున్నారు. డైరెక్టర్ కోర్స్ చదివేవారికి మొదటగా చెప్పేది వెండితెరపై హింస, రక్తపాతం అనేవి ఎక్కువగా చూపించకూడదు. ఒకవేళ చూపించినా కత్తితో పొడిస్తే పొడిచింది చూపించకుండా అవతలివాడి ఫీలింగ్ చూపిస్తూ, రక్తాన్ని ప్రేక్షకులకు చూపించకూడదనే రూల్ వుంది. గతంలో ఇలాంటివి దర్శకులు ఫాలో అయ్యేవారు. రాను రాను ట్రెండ్ పేరుతో ఓటీటీల పుణ్యమా అని హింసాశాతం ఎక్కువయింది. ఒకరకంగా శ్రుతిమించింది అని చెప్పవచ్చు. 
 
ఇలాంటి కథలకు, సినిమాలకు, వయెలెన్స్ కు సెన్సార్ బోర్డ్ ఎంత మేరకు పనిచేస్తుందో ప్రశ్నార్థకంగా మారిందనే చెప్పాలి. ఇప్పటి జనరేషన్ పల్స్ తెలిసిన నాని ఈరోజు ఓ స్టేట్ మెంట్ ఇచ్చాడు. సినిమా సూపర్ హిట్.. ఇవన్నీ పక్కన పెడితే ఇది జస్ట్ బిగినింగ్ ఆఫ్ హిట్ 3 జర్నీ.. ఈరోజు నుంచి ప్రతి రోజు కూడా ఒక సెలబ్రేషన్ లాగా ఉండబోతుంది. ఇది ఎక్కడికెళ్లి ల్యాండ్ అవుతుందనేది మా టీంఅంచనాలకి అందడం లేదు. అందుకే ఎలాంటి స్టేట్మెంటు ఇవ్వదల్చుకోలేదు అన్నారు.
 
ఇక రెట్రో సినిమా ముగింపులో మేడే అంటే కార్మికులకు స్వేచ్ఛ అంటూ సింక్ చేస్తూ, బానిసలకు స్వేచ్చ లభించింది. మేడే వచ్చిందంటూ చెప్పడం సందర్భానుసారంగా అనిపించింది. కానీ హిట్ 3 లో హింసచేసేవారంతా..తాము ఎందుకు చేస్తున్నామంటే. నాకు ఫ్రీడమ్ కావాలి. సమాజంలో ఏది చేసినా తప్పు అంటూ శిక్షలు విధిస్తారు.అందుకే తాము ఇలా డార్క్ వెబ్ సైట్ తో హింసచేస్తూ తాము స్వేచ్ఛాజీవులుగా బతుకున్నామంటూ చిత్రమైన సందేశాన్ని ఇస్తారు. అందుకు పోలీస్ అధికారిగా నాని కూడా అంతకంటే చిత్రహింసలు వారికి చూపిస్తాడు. ఈ రెండు సినిమాల్లోనూ ఫైనల్ గా కామన్ పోలిక స్వేచ్ఛ, ఫ్రీడమ్.. అనే పదాలు. మరోవైపుఈ రెండు సినిమాల్లోనూ డ్యూయెట్లు వుండవు. సీరియస్ గా కథ సాగుతుంటుంది. హిట్ 3లో నాని ఎంత సీరియస్ గా వుంటాడో, రెట్రో కూడా సూర్య అంతే సీరియస్ గా వుంటాడు. పెద్దగా నవ్వే సందర్భం కనిపించదు.