ఇద్దరు పిల్లలను గొంతుకోసి చంపిన తల్లి..
క్షణికావేశంలో కన్నతల్లే ఇద్దరు చిన్నారుల ప్రాణాలను పొట్టనపెట్టుకుంది. హత్య తరువాత మృతదేహాలు ఉన్న గదిలోనే ఉండిపోంది.
వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బరేలీ భూటా పోలీస్ స్టేషన్ పరిధిలో మట్కాపూర్ గ్రామంలో నివసించే బంటూ, జయంతి భార్యాభర్తలు.
వీరు వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ జీవిస్తున్నారు. గురువారం అర్థరాత్రి బంటు, జయంతి మధ్య గొడవ జరిగింది.
ఆగ్రహంతో జయంతి పిల్లలు నిద్రిస్తున్న గదిలోకి వెళ్లి లోపలి నుంచి తాళం వేసుకొని నిద్రించింది. అదే సమయంలో బంటు తన గ్రామంలోనే మరో ఇంట్లో నివసిస్తున్న తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయాడు. బంటూ వచ్చే సరికి ఎలాంటి స్పందన లేదు. కొద్దిసేపటికే అక్కడ ఇరుగు పొరుగు వారు గుమికూడారు.
వారి సహాయంతో తలుపులు పగులగొట్టి చూశారు. అప్పటికే రక్తపు మడుగులో పడి ఉన్న చిన్నారుల మృతదేహాలను చూసి చలించిపోయాడు. భర్త బంటూ ఫిర్యాదు మేరకు పోలీసులు జయంతిని అరెస్టు చేశారు. చిన్నారుల మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.