ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్

ప్రీపెయిడ్ యూజర్లకు జియో కొత్త ఆఫర్ - రూ.2,999కే యేడాది కాలపరిమితి...

jio offer
ప్రీపెయిడ్ యూజర్ల కోసం రిలయన్స్ జియో కొత్త ఆఫర్‌ను ప్రకటించింది. భారత గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని ఈ ఆఫర్‌ను ప్రకటించింది. రూ.2,999 రిచార్జ్‌తో ఒక యేడాది పాటు ఉచిత ఫోన్ కాల్స్‌ను అందిస్తుంది. అలాగే, రోజుకు 2.5 జీబీ డేటాను ఉచితంగా అందివ్వనుంది. అదేవిధంగా ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా ఇవ్వనుంది. 
 
రిపబ్లిక్ డే సందర్భంగా ప్రకటించిన ఈ ఆఫర్‌లో అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 2.5 బీజీ చొప్పున 5జీ డేటా, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్, అజియో, రిలయన్స్ డిజిటల్ కూపన్లను కూడా అందజేస్తుంది. ముఖ్యంగా, జియో టీవీ సబ్‍స్క్రిప్షన్ కింద్ 14 ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌ను చూడొచ్చు. 
 
ముఖ్యంగా, జీ5, డిస్నీ ప్లస్, హాట్‌స్టార్, జియో సినిమా వంటి ఓటీటీలను చూడొచ్చు. 365 రోజుల పాటు కాలపరిమితి కలిగిన ఈ ప్లాన్‌ కేవలం ప్రీపెయిడ్ యూజర్లకు మాత్రమే వర్తిస్తుందని రిలయన్స్ జియో విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. ఈ ఆఫర్ జనవరి 15 నుంచి 31వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.