మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 10 జూన్ 2020 (11:51 IST)

కూతురుని ప్రేమించాడు.. మాట్లాడుకుందాం రమ్మని.. చంపేశారు..

పూణేలో పరువు హత్య చోటుచేసుకుంది. తమ కుమార్తెను ప్రేమిస్తున్న ఓ దళిత యువకుడ్ని అగ్రవర్ణానికి చెందిన కుటుంబ సభ్యులు దారుణంగా కొట్టి చంపారు. వివరాల్లోకి వెళితే.. 20 ఏళ్ల విరాజ్‌ జగ్తాప్‌కు అగ్రకులానికి చెందిన ఓ యువతితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఈ విషయం తెలిసిన ఆమె కుటుంబ సభ్యులు మాట్లాడుకుందామని చెప్పి సోమవారం రాత్రి అతడ్ని ఇంటి నుంచి బయటకు రప్పించారు.
 
రోడ్డు మీద బైక్‌పై వెళ్తున్న విరాజ్‌ను తమ వాహనంతో ఢీకొట్టారు. అతడు కింద పడిపోగా ఇనుపరాడ్లు, బండ రాళ్లతో తీవ్రంగా కొట్టారు. తమ కుమార్తెను ప్రేమించడంపై ఆమె తండ్రి బూతులు తిట్టి దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన విరాజ్‌ దవాఖానలో చికిత్స పొందుతూ చనిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువతి తండ్రితో పాటు ఆరుగురిని అరెస్ట్‌ చేశారు.