శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 8 జూన్ 2020 (11:59 IST)

చున్నీయే యమపాశం అయ్యింది.. ఛాతికి తీవ్ర గాయాలతో మృతి

చున్నీయే ఆ మహిళ ప్రాణాలను బలిగొంది. వివరాల్లోకి వెళితే.. గోపవరం మండలం పెద్దపోలుకుంట గ్రామానికి చెందిన మునగల లక్ష్మీదేవి భర్త మునగల సుబ్రహ్మణ్యం పిల్లలతో కలిసి.. 15 రోజుల క్రితం ప్రకాశం జిల్లా పామూరు మండలంలోని చీమకుర్తిలో కూలీ పనులు చేసుకునేందుకు బంధువుల ఇంటికి వెళ్లారు. ఎన్ని రోజులు ఉన్నా పనులు దొరక్కపోవడంతో ఆదివారం మోటార్‌సైకిల్‌పై స్వగ్రామమైన పెదపోలుగుంట గ్రామానికి బయలుదేరారు.
 
వేడిగాలి తగలకుండా లక్ష్మీదేవి చున్నీని ముఖానికి కట్టుకుంది. మార్గంమధ్యలోని భూమిరెడ్డిపల్లె వద్ద 565 జాతీయ రహదారిపై బైక్‌ వెనుక చక్రానికి చున్నీ చుట్టుకోవడంతో ఆమె ఒక్కసారిగా కిందపడింది. తల, ఛాతికి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి సోదరుడు పొదిలి నరసింహులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.