శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 16 జనవరి 2020 (11:06 IST)

పేరుకేమో క్యాస్టింగ్ డైరక్టర్.. కానీ జూనియర్ ఆర్టిస్టులతో..?

పేరుకేమో క్యాస్టింగ్ డైరక్టర్.. కానీ జూనియర్ ఆర్టిస్టులతో చేసిస్తున్నది మాత్రం వ్యభిచారం. కానీ చివరికి పోలీసులకు చిక్కుకుపోయాడు. ఈ ఘటన ముంబైలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నవీన్ ప్రేమ్‌లాల్ ఆర్య (32) అనే వ్యక్తి బాలీవుడ్‌లో క్యాస్టింగ్ డైరక్టర్‌గా పనిచేస్తున్నాడు. అయితే ఇతనిని మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. 
 
నవీన్ గత కొన్ని నెలలుగా సెక్స్ రాకెట్ దందా నడిపిస్తున్నాడని సమాచారం అందడంతో పోలీసులు నిఘా వేశారు. ఈ ఊబిలో ఎంతో మంది మేకప్ ఆర్టిస్టులు, పలువురు మోడళ్లు, బాలీవుడ్ జూనియర్ యాక్టర్లు ఉన్నట్లు గుర్తించారు.
 
మంగళవారం నాడు కూడా ఓ మేకప్ ఆర్టిస్టును.. జూనియర్ ఆర్టిస్టును కూడా ఈ రొంపిలోకి దిగాలని ఒత్తిడి చేశాడు. చివరికి ఇద్దరికీ 60వేల రూపాయలు ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే పోలీసులు అతడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసుకుని నవీన్‌ను కటకటాల వెనక్కి నెట్టారు.