సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 13 ఆగస్టు 2021 (11:52 IST)

ముంబైలో డెల్టా ప్లస్ తొలి మరణం - అప్రమత్తమైన బీఎంసీ

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో డెల్టా ప్లస్ వైరస్ సోకిన వ్యక్తి మరణించాడు. మన దేశంలో డెల్టా ప్లస్‌తో చనిపోయిన తొలి కేసు ఇదే. జూలై 27వ తేదీన 63 ఏళ్ల వ్య‌క్తి మ‌ర‌ణించిన‌ట్లు సమాచారం. 
 
జూలై 21వ తేదీన ఆ వ్య‌క్తి పాజిటివ్‌గా తేలింది. ఆ పేషెంట్‌కు డయాబెటిస్‌తో పాటు ప‌లు ర‌కాల రుగ్మ‌త‌లు ఉన్నాయ‌ని అధికారులు చెప్పారు. రెండు డోసుల టీకాలు తీసుకున్న త‌ర్వాత ఆ మ‌హిళ‌కు వైర‌స్ సోకిన‌ట్లు గుర్తించారు. అయితే మృతిచెందిన వ్య‌క్తికి మాత్రం ట్రావెల్ హిస్ట‌రీ లేద‌ని అధికారులు చెప్పారు. 
 
కాగా, ముంబైలో ఏడు మందికి డెల్టా ప్ల‌స్ వేరియంట్ సోకిన విష‌యం తెలిసిందే. ఆమె నుంచి సేక‌రించిన జీనోమ్ శ్యాంపిళ్ల సీక్వెన్సింగ్ రిపోర్ట్ బుధ‌వారం వ‌చ్చిది. ఆమెతో స‌న్నిహ‌త సంబంధం క‌లిగి ఉన్న మ‌రో ఇద్ద‌రికి డెల్టా ప్ల‌స్ వేరియంట్ ప‌రీక్ష‌లో పాజిటివ్ వ‌చ్చిన‌ట్లు తేలింది.