బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 10 జనవరి 2021 (08:34 IST)

పోర్న్ సైట్స్ ఎఫెక్టు.. తాళ్ళతో బంధించుకుని శృంగారం.. చివరకు

కొందరు కామాంధులు శృంగారంలో రెచ్చిపోతున్నారు. పోర్న్ సైట్లు చూస్తూ, మితిమీరిన శృంగారం చేస్తూ ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు. తాజాగా ఓ జంట తాళ్ళత బంధించుకుని శృంగారంలో పాల్గొంది. చివరకు అది వికటించి వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, నాగపూర్‌కు చెందిన ఓ వ్యక్తికి ఇప్పటికే పెళ్లి అయింది. ఈయనతో ఇదివరకే పెళ్లయి సంతానం కలిగిన మహిళ ఐదేళ్లుగా రిలేషన్ కంటిన్యూ చేస్తోంది. వీరిద్దరూ లాడ్జ్‌లో రూమ్ తీసుకున్నారు. శృంగారం సమయంలో ఆ మహిళ అతన్ని తాళ్లతో కుర్చీకి బిగుతుగా కట్టేసింది. 
 
అనుకోకుండా కుర్చీ జారీ కింద పడిపోవడంతో ఆ తాడు అతని మెడకు గట్టిగా బిగుసుకుంది. దీంతో ఊపిరాడక ఆ వ్యక్తి మృతి చెందాడు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.