బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 9 జనవరి 2021 (11:27 IST)

సీమంతంలో స్టెప్పులేసిన హరితేజ.. వీడియో వైరల్

Hari Teja
తెలుగు బిగ్ బాస్ ఒకటో సీజన్ కంటెస్టెంట్ హరితేజ గర్బవతి అనే సంగతి తెల్సిందే. ఆమె అతి త్వరలోనే బిడ్డకు జన్మను ఇవ్వబోతున్నారు. ఇటీవల ఆమె కుటుంబ సభ్యులు, సన్నిహితులు స్నేహితుల సమక్షంలో సీమంతం జరిగింది. సీమంతం వేడుక చాలా విభిన్నంగా ప్లాన్ చేశారు.

మామూలుగా హరితేజ చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఆమె ఉన్న చోట చాలా సందడి వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. ఇక తన శ్రీమంతం వేడుకలో కూడా అదే రిపీట్ చేశారు. 
 
ఆమె చిన్న చిన్న స్టెప్పులు వేసి అందరిని ఆకర్షించారు. ఆమె సోషల్ మీడియా అకౌంట్‌లో శ్రీమంతంకు సంబంధించిన ఫొటోలు వీడియోలను షేర్ చేశారు. ఆ వీడియోల్లో సన్నిహితులు స్నేహితులతో కలిసి హరితేజ డాన్స్ చేశారు. 
 
వాల్మీకి సినిమాలోని ఐటెం సాంగ్ సూపర్ హిట్టు నీ హైటు.. పాటకు స్టెప్పులు వేశారు. నిండు గర్భిణి అయినా కూడా ఆమె స్టెప్పులు వేయడం ఆమె ఎనర్జీకి నిదర్శణం అంటూ అభిమానులు వ్యాఖ్యలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఆమె వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.