సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 23 డిశెంబరు 2020 (20:43 IST)

కొబ్బరి పాలను గర్భిణీ మహిళలు తీసుకుంటే? (video)

coconut Milk
ఆమ్లాల ద్వారా ఏర్పడే ఉదర రుగ్మతలను తొలగించుకోవాలంటే.. కొబ్బరి తురుము నుంచి తీసిన పాలను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో ఆరోగ్యానికి కావలసిన అమినో-యాసిడ్స్ పుష్కలంగా వున్నాయి. ఇవి పిల్లల శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. 
 
కొబ్బరి పాలలో మాంగనీస్‌ పుష్కలంగా వుంది. దీనిని తీసుకుంటే మధుమేహం ఏర్పడే ప్రమాదం తగ్గుతుంది. ఇందులోని లారిక్ యాసిడ్, కాప్రిక్ యాసిడ్ వైరస్, బ్యాక్టీరియాలతో పోరాడే శక్తినిస్తాయి. కొబ్బరి పాలు వారానికి రెండు సార్లు తీసుకుంటే వైరస్, బ్యాక్టీరియాలతో ఏర్పడే రుగ్మతల నుంచి తప్పించుకోవచ్చు. ఇందులో వ్యాధి నిరోధక శక్తి అధికంగా వుంటుంది. 
 
కొబ్బరిలోని విటమిన్-ఇ వృద్ధాప్య ఛాయలను దరిచేరనివ్వదు. ఇందులో క్యాల్షియం ఎముకలకు బలాన్నిస్తుంది. అలాగే ఫాస్పరస్ ఎముకలను ఆరోగ్యంగా వుంచుతాయి. కొబ్బరి పాలను రోజూ తీసుకోవడం ద్వారా మహిళలు బలంగా వుంటారు. 
 
ఎముకలకు సంబంధించిన వ్యాధులను ఈ కొబ్బరిపాలు దూరం చేస్తుంది. అలాగే గర్భిణీ మహిళలు కొబ్బరి పాలను తీసుకోవడం ద్వారా గర్భస్థ శిశువుకు పుష్కలమైన ధాతువులు లభిస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.