సోమవారం, 13 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 13 జనవరి 2025 (20:21 IST)

కిషన్ రెడ్డి నివాసంలో సంక్రాంతి.. హాజరైన ప్రధాని, మెగాస్టార్ చిరంజీవి (video)

Modi
Modi
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నివాసంలో సంక్రాంతి సంబరాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఈ వేడుకలకు మెగాస్టార్ చిరంజీవి సైతం హాజరయ్యారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, శ్రీనివాస వర్మ, మెగాస్టార్ చిరంజీవి.. ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు. 
 
తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా కిషన్ రెడ్డి ఇంట్లో సంక్రాంతి వేడుకలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రధానితో పాటు బీజేపీ అగ్రనేతలు, తెలుగు రాష్ట్రాల ఎంపీలు, ప్రముఖులు హాజరయ్యారు. అతిథులకు తెలుగు వంటలను సైతం రుచి చూపించేలా పలు వంటకాలను సిద్ధం చేశారు. 
Modi
Modi
 
ఇకపోతే.. మకర సంక్రాంతి పండుగ, మంగళవారం, జనవరి 14, నాడు జరుపుకుంటారు. సూర్యుడు మకరంలోకి మారడాన్ని సూచిస్తుంది. మకర సంక్రాంతిని పురస్కరించుకుని, పవిత్ర నగరమైన ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభ్ కూడా ప్రారంభమైంది. ఇందులో అమృత స్నాన్ మకర సంక్రాంతి, జనవరి 14న జరుగుతుంది. 

Modi
Modi