శనివారం, 16 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 23 మే 2024 (13:56 IST)

నకిలీ సిమ్ కార్డుల అడ్డుకట్టకు చర్యలు.. ఇకపై సిమ్ కావాలంటే ఆ పని చేయాల్సిందే...

sim cards
దేశ వ్యాప్తంగా నకిలీ సిమ్ కార్డుల బెడద పెరిగిపోయింది. నకిలీ సిమ్ కార్డులతో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. వీటికి అడ్డుకట్టకు కేంద్రం దృష్టిసారించింది. ఇకపై బయోమెట్రిక్ పూర్తి చేస్తే కొత్త సిమ్ విధానాన్ని అమల్లోకి తీసుకునిరానుంది. ఈ విధానం రానున్న సెప్టెంబరు 15వ తేదీ నుంచి అమల్లోకి తీసుకొచ్చే దిశగా కేంద్రం చర్యలు చేపట్టింది. 
 
సైబర్ నేరాల అడ్డుకట్టకు వేసేందుకు కఠిన చర్యలు చేపట్టేందుకు, కఠిన నిబంధనలు అమల్లోకి తెచ్చేందుకు కేంద్రం సిద్ధమైంది. మరీ ముఖ్యంగా సిమ్ కార్డుల జారీ విషయంలో మరింత కఠినంగా వ్యవహరించాలని భావిస్తుంది. యధేచ్చగా జారీ అవుతున్న సిమ్ కార్డులను ఉపయోగించుకుని నేరగాళ్ళు ఇష్టానుసారంగా చెలరేగిపోతున్నారు. ఈ నేపథ్యంలో టెలీకమ్యూనికేషన్ చట్టం 2023లో తీసుకొచ్చిన నిబంధనలు సెప్టెంబరు నుంచి అమల్లోకి తీసుకుని రావాలని డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్ నిర్ణయించింది. 
 
కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే అడిగిన వెంటనే సిమ్ కార్డు జారీ ఉండదు. బయోమెట్రిక్ పూర్తి చేస్తేనే కొత్త సిమ్ కార్డు జారీ చేస్తారు. అలాగే, స్పెక్ట్రమ్ కేటాయింపులతో పాటు శాటిలైన కమ్యూనికేషన్‌కు సంబంధించి కూడా నిబంధనలు రానున్నాయి. ఈ నిబంధనలు అమల్లోకి వస్తే దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు ప్రారంభించాలన్నా స్పెక్ట్రమ్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది.