శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 4 ఆగస్టు 2020 (20:01 IST)

సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించాలి.. కేంద్రానికి బీహార్ సీఎం సిఫార్సు

హీరో సుశాంత్ మరణానికి సంబంధించి బీహార్ సీఎం నితీష్ కుమార్ స్పందించారు. సుశాంత్ తండ్రి సీఎం నితీష్‌తో మాట్లాడారు. సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించేలా చూడాలని ఆయన కోరారు. దీనికి స్పందించిన నితీస్ సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. సుశాంత్ మరణంపై ఇప్పటికే బీహార్, మహారాష్ట్ర సర్కార్‌ల మధ్య తీవ్ర విబేధాలు తలెత్తుతున్నాయి.
 
ఇలాంటి పరిస్థితుల్లో సుశాంత్ సింగ్ మృతి కేసు మహారాష్ట్రలో తీవ్ర దుమారం రేపుతోంది. బాలీవుడ్‌తో పాటు రాజకీయ వర్గాలను షేక్ చేస్తోంది. ఐతే సుశాంత్ మృతి వెనక మహారాష్ట్ర సీఎం కుమారుడు, మంత్రి ఆదిత్య థాక్రే హస్తముందని ప్రచారం జరుగుతోంది. 
 
మహారాష్ట్ర ప్రభుత్వంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు మౌనం వీడిన ఆదిత్య.. ఆ ఆరోపణలను ఖండించారు. కొందరు కావాలనే తనపై, థాక్రే ఫ్యామిలీపై బురద జల్లుతున్నారని.. ఒకరికి మరణంపై రాజకీయాలు చేస్తున్నారని ఎదురుదాడి చేశారు. సుశాంత్ సింగ్ మృతితో తనకు ఏ విధంగానూ సంబంధం లేదని స్పష్టం చేశారు.