శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 20 జులై 2018 (13:36 IST)

ఉద్యోగాలు అడిగితే పకోడీలు అమ్ముకోమన్నారు.. నవ్వుతున్నారు కానీ?: రాహుల్

ఏపీకి అన్యాయం జరిగిందనే ఆవేదనతో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రసంగం మొదలెట్టారు. పార్లమెంట్ సమావేశాల్లో అవిశ్వాసంపై చర్చ జరుగుతున్న వేళ, టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్, బీజేపీ ఎంపీ రాకేష్ సింగ్ ప్రసంగ

ఏపీకి అన్యాయం జరిగిందనే ఆవేదనతో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రసంగం మొదలెట్టారు. పార్లమెంట్ సమావేశాల్లో అవిశ్వాసంపై చర్చ జరుగుతున్న వేళ, టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్, బీజేపీ ఎంపీ రాకేష్ సింగ్ ప్రసంగం తర్వాత రాహుల్ గాంధీ ప్రసంగాన్ని మొదలెట్టారు.


రాకేష్ సింగ్, గల్లా జయదేవ్ ప్రసంగం ఆసక్తికరంగా సాగిందన్నారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు.. ఇప్పుడు అవి ఏమయ్యాయంటూ ప్రశ్నించారు. ఉద్యోగాలు అడిగితే పకోడీలు అమ్ముకోమన్నారు అంటూ రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. 
 
జీఎస్టీలో ఒకటే శ్లాబ్ వుండాలన్నాం. కానీ ఐదు స్లాబ్‌లు తెచ్చారు. పెట్రోల్ డీజిల్ ధరలు జీఎస్టీలో వుండాలన్నాం. కానీ తీసుకురాలేదని రాహుల్ గాంధీ ఏకిపారేశారు. దేశానికి సేవకుడిగా వుంటానని మోదీ అన్నారు. కానీ అమిత్ షా కొడుకు అవినితీకరి పాల్పడితే ఈ సేవకుడు ఏమయ్యారని రాహుల్ ప్రశ్నించారు. గల్లా జయదేవ్ ప్రసంగంలో ఏపీ ప్రజల ఆవేదన కనిపించింది.
 
ఏపీ విషయంలో ప్రధాని గారడీ కబుర్లు చెప్తున్నారు. దేశానికి ప్రధానిని కానని, సేవకుడని మోదీ అంటుంటారు. అయితే ప్రధాని మిత్రుడు పుత్రులు ఆస్తుల శాతం పెంచుకుంటుంటే.. ఆ సేవకుడు ఏమయ్యారని అడిగారు. ఏం సాధించారని దేశం అడుగుతోందని రాహుల్ గాంధీ అన్నారు. తాను మాట్లాడుతుంటే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నవ్వుతున్నారు కానీ లోలోపల టెన్షన్ పడుతున్నారని ఎద్దేవా చేశారు.