బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 4 మే 2020 (23:25 IST)

కరోనాకే చుక్కలు చూపించిన కేరళ.. 2 రోజుల నుంచి ఒక్క కేసు లేదు..

కేరళ కరోనాకే చుక్కలు చూపించింది. ప్రపంచ దేశాలు కరోనా అంటేనే జడుసుకుంటున్న వేళ కేరళలో గత రెండు రోజుల నుంచి ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. 
 
కానీ మన దేశంలో తొలి కరోనా కేసు కేరళలోనే నమోదైంది. ఆ తర్వాత ఆ రాష్ట్రంలో కేసులు పెరిగిన తీరు దేశాన్ని బెంబేలెత్తించింది. అయితే, అక్కడి ప్రభుత్వం తీసుకున్న చర్యలు, అధికారుల కృషి, ప్రజల భాగస్వామ్యం ఆ రాష్ట్రాన్ని కరోనా రక్కసి నుంచి బయటపడేలా చేశాయి. 
 
ఈ క్రమంలో రెండు రోజులుగా ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. అంతేకాకుండా సోమవారం 61మంది పేషెంట్లు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 34 యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి.