శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By జె
Last Modified: సోమవారం, 4 మే 2020 (21:16 IST)

శోభనం రాత్రి భార్యతో ఉన్న భర్తను లాక్కెళ్ళిన వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, ఎందుకు?

కరోనాతో చాలామంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పెళ్ళిళ్ళు పెట్టుకున్న వారైతే చేసుకోలేక తెగ బాధపడిపోతున్నారు. పెళ్ళిళ్ళు పూర్తిగా క్యాన్సిల్స్ చేసేసుకున్నారు. కానీ మరికొంతమంది మాత్రం దొంగచాటుగా కుటుంబ సభ్యులతో కలిసి పెళ్ళిళ్ళు చేసేసుకుంటున్నారు. అలాంటి పెళ్ళే కర్ణాటకలో జరిగింది. కానీ పెళ్ళి తరువాత జరగాల్సిన శోభనం మాత్రం ఆగిపోయింది.
 
కర్ణాటక రాష్ట్రం ఉడుపి జిల్లా కుత్యూరు ప్రాంతానికి చెందిన యువతికి, బోలాజిల్లాకు చెందిన యువకుడికి గత నెల 29న వివాహం జరిగింది. పదిమంది కుటుంబ సభ్యులతో ఎవరికీ అనుమానం రాకుండా పెళ్ళి చేసేసుకున్నారు. అయితే శోభనానికి మాత్రం మూడురోజులు ఆగాలని పండితుడు చెప్పడంతో ఆగారు. సరిగ్గా ఈ నెల 3వ తేదీ శోభనానికి అన్నీ సిద్థం చేసేసుకున్నారు.
 
విషయమంతా స్థానికులకు తెలిసింది. వరుడు కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతం నుంచి వచ్చాడని స్థానికులకు సమాచారం వచ్చింది. వెంటనే పోలీసులకు చెప్పేశారు. పోలీసులు కూడా సరిగ్గా సాయంత్రం సమయానికే వచ్చారు. అప్పుడే తన భార్యతో కలిసి గదిలోకి వెళ్ళాడు భర్త. అయితే ఇంతలో పోలీసులు తలుపులు కొట్టి బయటకు పిలిచారు.
 
పోలీసులతో పాటు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఉన్నారు. మీరు పాజిటివ్ రోగులు ఎక్కువ ఉన్న ప్రాంతం రెడ్ జోన్ నుంచి వచ్చారు. మీరు క్వారైంటైన్లో 14 రోజులు ఉండాలి. మీతో పాటు మీరు పెళ్ళి చేసుకున్న భార్య, వాళ్ళ అమ్మా, నాన్నలు, పెళ్ళికి వచ్చిన వారందరూ ఉండాలని ముందుగా నూతన వధూవరులను తీసుకెళ్ళారట. శోభనం తరువాత వస్తానని బతిమాలినా వైద్యఆరోగ్య శాఖ అధికారులు ఒప్పుకోకుండా లాక్కెళ్ళారట.