శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By జె
Last Modified: శుక్రవారం, 27 మార్చి 2020 (20:48 IST)

పెళ్లయి ఐదురోజులే, కనిపించకుండా పోయిన నవ వధువు

హైదరాబాద్ లోని కామ్‌గార్ నగర్‌లో నివాసముంటున్న సత్యనారాయణ, ఐశ్వర్యలకు ఐదురోజుల క్రితం వివాహమైంది. పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్నారు. పెళ్ళి తరువాత అత్త, మామ, భర్తతో ఐశ్వర్య బాగానే ఉంది. అయితే నిన్న ఉదయం ఇంటి ఎదురుగా ఉన్న మార్కెట్‌కు వెళ్లి వస్తానని ఇంటి నుంచి వెళ్లింది. ఆ తరువాత కనిపించకుండా పోయింది.
 
కరోనా ప్రభావం ఉండటంతో ఇంటి నుంచి ఒకరే బయటకు వెళ్లాలన్న నిబంధన తెలంగాణా రాష్ట్రంలో ఉంది. దీంతో ఐశ్వర్య మాత్రమే బయటకు వెళ్ళింది. అంతకుముందు కూడా మార్కెట్‌కు వెళ్లి వస్తూ ఉండేది ఐశ్వర్య. దీంతో సత్యనారాయణ ఆమెనే పంపించాడు. కానీ వెళ్లిన భార్య ఎంతకూ తిరిగిరాకపోవడంతో వెంటనే మార్కెట్‌కు వెళ్ళి చూశాడు.
 
అక్కడున్న వారందరినీ అడిగాడు. సి.సి. కెమెరాల్లోను చూశాడు. తన భార్య మార్కెట్‌కు వచ్చి కొనుక్కుని వెళ్ళినట్లు ఉంది. కానీ ఇంటికి తిరిగిరాలేదు. దీంతో బంధువులు, స్నేహితులకు అందరికీ ఫోన్లు చేసిన సత్యనారాయణ చివరకు చేసేది లేక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఐశ్వర్యను ఎవరైనా కిడ్నాప్ చేశారా.. లేకుంటే ఫ్రెండ్స్‌తో పాటు వెళ్ళిందా.. లేకుంటే ఇష్టం లేని పెళ్ళి ఏమైనా చేశారా అన్న కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించారు.