భర్త మోసం.. మనస్తాపంతో నవవధువు ఆత్మహత్య

bride
bride
సెల్వి| Last Updated: సోమవారం, 23 మార్చి 2020 (09:59 IST)
నవవధువు భర్త మోసాన్ని గ్రహించి ఆత్మహత్యకు పాల్పడింది. పెళ్లి చేసుకోవడమే ఆమె పాలిట శాపంగా మారిపోయింది. భర్త మోసం చేశాడనే మనస్తాపంతో నవవధువు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం గట్టిక్కల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.... హైదరాబాద్ శివార్లలో ఐదెకరాల భూమి ఉందని.. విదేశాల్లో గొప్ప ఉద్యోగం ఉందని... పెళ్లికి ముందు మాయమాటలు చెప్పి ఓ యువతిని నమ్మించి పెళ్లి చేసుకున్న భర్త తనను పెళ్లి చేసుకున్నాడనే విషయం తర్వాత తెలియడంతో తీవ్ర మనస్థాపానికి గురైన యువతి తనువు చాలించింది.

గట్టికల్‌కు చెందిన సామ ఇంద్రారెడ్డి ప్రభుత్వ టీచర్‌గా పనిచేస్తూ ఉంటాడు. ఇతనికి ఇద్దరు కూతుర్లు ఉండగా... పెద్ద కూతురు సీఏ పూర్తి చేసి మంచి ఉద్యోగం చేస్తుంది. దీంతో మౌనిక‌కు పెళ్లి చేయాలని భావించారు తల్లిదండ్రులు.

ఈ క్రమంలోనే హైదరాబాద్‌కు చెందిన సాయికిరణ్ రెడ్డి... విదేశాల్లో మంచి ఉద్యోగం చేస్తున్నానని హైదరాబాద్‌లో కూడా ఐదెకరాల స్థలం ఉంది అని మౌనిక తల్లిదండ్రులను నమ్మించాడు. దీంతో తమ కూతురికి మంచి సంబంధం దొరికిందని తల్లిదండ్రులు ఆనందపడ్డారు. సాయి కిరణ్ రెడ్డితో ఈ నెల 15న సూర్యపేటలో ఘనంగా వివాహం జరిపించారు. భారీ కట్నంతో అత్తారింటికి వెళ్లిన నవవధువు అప్పుడే అసలు విషయం తెలిసింది.

ఇంకా తన కూతుర్ని పెళ్లి చేసుకున్న సాయి కిరణ్‌కి ఎలాంటి జాబ్ కానీ భూమి కానీ లేదని తెలిసింది. దీంతో ఆగ్రహానికి లోనైన మౌనిక తల్లిదండ్రులు వారి బంధువులను నిలదీయగా వారికి అక్కడ అవమానం ఎదురైంది. మౌనికతో పాటు ఆమె తల్లిదండ్రులపై సాయికిరణ్ రెడ్డి కుటుంబీకులు దాడిచేసి గెంటేశారు.

అయితే అయితే భర్త చేసిన మోసం మెట్టింటి వారు చేసిన అవమానం తట్టుకోలేక పోయిన మౌనిక.. తన పెళ్లి కార్డుపై సూసైడ్ నోట్ రాసి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇక ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.దీనిపై మరింత చదవండి :