శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్

ఇక మద్యంబాబులకు పండగే.. కరోనా దెబ్బకు డ్రంకెన్ డ్రైవ్‌లకు స్వస్తి

హైదరాబాద్ నగరంలో మద్యంబాబులకు ఇకపండగే. కరోనా వైరస్ కారణంగా డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలను తాత్కాలికంగా నిలిపి వేయాలని హైదరాబాద్ నగర పోలీసులు నిర్ణయించారు. తనిఖీల సందర్భంగా మిషన్ల ద్వారా వైరస్ ఒకరి నుంచి మరొకరికి చేరే అవకాశం ఉందన్న ఉద్దేశంతో జనం ఆరోగ్యం దృష్ట్యా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. 
 
ఇదేదో బాగుందే అని మందుబాబులు సంబరపడిపోవడానికి లేదు. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద నిఘా నేత్రాలు (సీసీ కెమెరాలు) వాహన చోదకులను గమనిస్తుంటాయని, నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
 
ఇదేసమయంలో పెండింగ్ చలానాల వసూళ్లపై కూడా దృష్టిసారించారు. సిగ్నల్ జంపింగ్, హెల్మెట్ పెట్టుకోకుండా డ్రైవింగ్ చేస్తే సీసీ కెమెరాల ద్వారా పసిగట్టి వాహన చోదకులకు జరిమానాలు పంపుతుంటారు.