గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 1 డిశెంబరు 2021 (13:55 IST)

సరిహద్దుల్లో చనిపోయిన రైతుల వివరాలు లేవు .. పరిహారం ఇవ్వలేం : కేంద్రం

మూడు వివాదాస్పద సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేసిన ఆందోళనల్లో ప్రాణాలు కోల్పోయిన రైతుల వివరాలు లేవని, అందువల్ల వారికి పరిహారం ఇవ్వలేమని కేంద్రం తేల్చి చెప్పింది. ఈ మేరకు ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లోభాగంగా, విపక్ష ఎంపీ అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ శాఖామంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సమాధనమిచ్చారు. 
 
ప్రభుత్వం వద్ధ వివిధ కారణాలతో చనిపోయిన రైతుల వివరాలు లేవని స్పష్టంచేశారు. అందువల్ల వారికి పరిహారం ఇచ్చే సమస్యే లేదని స్పష్టం చేశారు. అదేసమయంలో నిరసనలను ఆపాలని రైతులను ఎప్పటి నుంచో కోరుతున్నామన్నారు. కానీ, వారు వినిపించుకోకుండా సరిహద్దుల్లో ఆందోళన చేస్తూనే ఉన్నారన్నారు. 
 
అలాగే, మరో ఎంపీ పంటలకు కనీస మద్దతు ధర చట్టం అమలు చేస్తారా అని ప్రశ్నించారు. దీనికి మంత్రి తోమర్ సమాధానమిస్తూ, ఇప్పటికే 22 ధరలకు కేంద్రం మద్దతు ధర కల్పించిందని గుర్తుచేశారు. కాగా, సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేసిన ఆందోళనల్లో దాదాపు 750మంది వరకు చనిపోయినట్టు రైతు సంఘాల నేతలు చెబుతున్నారు.