శనివారం, 9 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 24 ఆగస్టు 2020 (08:55 IST)

వ్యాక్సిన్ కు తొందరేమీ లేదు: ఎస్‌ఎస్‌ఐ

వ్యాక్సిన్ విడుదలలో తొందరపాటు ప్రదర్శించబోమని సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఎస్‌ఐ) స్పష్టం చేసింది. భారత్‌లో మరో 73 రోజుల్లో కొవిడ్‌ -19 వ్యాక్సిన్‌ విడుదలవబోతుందనే వార్త అవాస్తవమని కొట్టిపారేసింది.

వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసేందుకు, భవిష్యత్‌ అవసరాల కోసం తగినంతగా నిల్వ చేసుకునేందుకే ప్రభుత్వం అనుమతినిచ్చిందని సంస్థ స్పష్టం చేసింది.

ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ సారథ్యంలో అభివృద్ధి చెందిన కొవిడ్‌ వ్యాక్సిన్‌ను అస్ట్రాజెన్‌కా భాగస్వామ్యంలో సీరమ్‌ సంస్థ భారత్‌లో ఉత్పత్తి చేసేందుకు అనుమతి పొందింది.

ఈ వ్యాక్సిన్‌ రోగనిరోధక శక్తిని పెంచేదిగాను, వైరస్‌పై సమర్థవంతంగా పనిచేస్తుందని రుజువైన అనంతరమే వ్యాక్సిన్‌ మార్కెట్‌లోకి విడుదల చేసేందుకు అధికారికంగా అనుమతి లభిస్తుందని తెలిపింది.