శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 18 ఆగస్టు 2020 (23:05 IST)

నలుగురికి 32ల‌క్ష‌ల రూపాయ‌ల ఆర్థిక సాయం..ఎవరు?

వాస‌వి సుర‌క్షా ప‌థ‌కం ముఖ్యోద్దేశ్యము ఆర్యవైశ్యుల కుటుంబములలో ఇంటి పెద్ద అకాల మరణము సంభవిస్తే ఆ కుటుంబమునకు ఆసరాగా నిలవడమే అని దేవ‌దాయ, ధ‌ర్మ‌దాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీ‌నివాస‌రావు పేర్కొన్నారు. 

మంగ‌ళ‌వారం బ్ర‌హ్మ‌ణ విధిలోని దేవ‌దాయ శాఖ మంత్రి కార్యాల‌యంలో వాస‌వి సుర‌క్షా ప‌థ‌కం ఆర్థిక సాయం చెక్కుల‌ను మంత్రి పంపిణి చేశారు. 
 
ఈ సంద‌ర్భంగా వాస‌వీ క్ల‌బ్ స‌భ్యుల‌ను మంత్రి వెలంప‌ల్లి అభినందించారు, కార్యక్రమంలో వాస‌వి క్ల‌బ్ జిల్లా గ‌వ‌ర్న‌ర్ బొడ్డు శ్రీ‌నివాస‌రావు, ఉపాధ్య‌క్షులు సంతోష్ చ‌క్ర‌వ‌ర్తి, గ‌డ్డం ప‌వ‌న్ కుమార్‌, పొట్టి శివ‌కుమార్‌, వేముల నాగ‌రాజు, ముర‌ళీ కృష్ణ‌, మ‌రియు చాంబ‌ర్ ఆప్ కామ‌ర్స్ అధ్య‌క్ష‌లు కొన‌క‌ళ్ళ విద్యాధ‌ర రావు, కొండ‌ప‌ల్లి బుజ్జి తదితరులు పాల్గొన్నారు.