ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 15 జులై 2017 (12:32 IST)

బాగా మగ్గబెట్టిన పనసపండు ఇంట్లో పెట్టుకున్న పాపం.. ఏనుగులు వచ్చి?

బాగా మగ్గబెట్టిన పనసపండును ఇంట్లో వుంచిన పాపానికి ఆ తల్లీకూతుళ్లు ప్రాణాలు కోల్పోయారు. పనసపండు వాసనకు ఇంట్లోకి చొరబడిన ఏనుగుల గుంపు ఆ ఇంట్లోని తల్లీకుమారుడిని పొట్టనబెట్టుకున్నాయి. ఈ ఘటన ఒడిశాలోని కచు

బాగా మగ్గబెట్టిన పనసపండును ఇంట్లో వుంచిన పాపానికి ఆ తల్లీకూతుళ్లు ప్రాణాలు కోల్పోయారు. పనసపండు వాసనకు ఇంట్లోకి చొరబడిన ఏనుగుల గుంపు ఆ ఇంట్లోని తల్లీకుమారుడిని పొట్టనబెట్టుకున్నాయి. ఈ ఘటన ఒడిశాలోని కచురా ప్రాంతంలో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. కచురా గ్రామానికి చెందిన సమరి ప్రధాన్(35) ఇంట్లో బాగా పండిన పనసపండు వున్నది. అర్థరాత్రి సుమారు 12 గంటల సమయంలో పనసపండు సువాసనను గ్రహించిన ఐదు ఏనుగులు వారి ఇంటిని చుట్టుముట్టాయి. ఆ సమయంలో సమరి ఆమె కుమారుడు శత్రఘ్నుడు (6) ఇంట్లో ఉన్నారు. ఇంట్లోకి ప్రవేశించిన ఏనుగులు సమరిని, శత్రఘ్నను తొండంతో పైకెత్తి విసిరికొట్టి చంపేశాయి. 
 
స్థానికుల సమాచారం అందేలోపు ఏనుగులు ఇంటి నుంచి వెళ్ళిపోయాయి. అటవీ అధికారులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం పంపించారు. తరచుగా తమ గ్రామంపై ఏనుగుల దాడి చేస్తున్నాయని, దీనిని నివారించాలని గ్రామస్థులు అధికారులను విజ్ఞప్తి చేశారు. కాగా సమరి భర్తను కోల్పోయింది. ఆమెకు మరో కుమారుడున్నాడు. అతనిని ఇటీవలే హాస్టల్‌లో చేర్చిన సమరి.. ఆమె అమ్మ, రెండో కుమారుడితో కచురాలో వుంటోంది. 
 
ప్రస్తుతం సమరి కాస్త మరణించడంతో ఆమె పెద్ద కుమారుడు అనాధగా మిగిలిపోయాడు. అతనికి నష్టపరిహారంగా ప్రభుత్వం రూ.6లక్షలు ఇవ్వాల్సిందిగా జిల్లా అధికారులు కోరారు. ఏనుగుల నుంచి తన బిడ్డను రక్షించాలని సమరి ఎంతగానో పోరాడిందని.. అయితే ఏనుగులు వారిద్దరీ మట్టుబెట్టాయని అధికారులు చెప్తున్నారు.