మంగళవారం, 19 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 15 అక్టోబరు 2016 (12:50 IST)

వచ్చే యేడాది దేశవ్యాప్తంగా కమల పవనాలే... ఒపీయన్ పోల్‌లో వెల్లడి

వచ్చే యేడాది ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయకేతనం ఎగుర వేస్తుందని ఒపీనియన్ పోల్ ఫలితాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మాత్రం రెండు ర

వచ్చే యేడాది ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయకేతనం ఎగుర వేస్తుందని ఒపీనియన్ పోల్ ఫలితాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మాత్రం రెండు రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోతుందని తేలింది. అయితే, ఇప్పటికిపుడు ఎన్నికలు జరిగితే మాత్రం పంజాబ్ రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ పార్టీకి అనుకూల పవనాలు వీచే అవకాశం ఉన్నట్టు తెలిపింది. 
 
ఇండియా టుడే- యాక్సిస్ మై ఇండియా సంస్థలు ఈ ఒపీనియన్ పోల్‌ను నిర్వహించాయి. ఇందులో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. 2017లో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్, పంజాబ్‌లలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే వాటిలో నాలుగు రాష్ట్రాలను కమలదళం పార్టీ గెలుచుకునే అవకాశాలున్నాయి. పంజాబ్‌లో మాత్రం ఆ పార్టీ ఓటమిపాలు కాకతప్పదు. 
 
ఈ సర్వేలో భాగంగా మొత్తం 37,866 మంది ఓటర్లను అభిప్రాయాన్ని సేకరించగా ప్రస్తుత పాలకులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పాకిస్థాన్ భూభాగంలోకి వెళ్లి అక్కడ సరిహద్దుల వెంబడి పొంచి ఉన్న ఉగ్రవాదులను అంతమొందించడానికి లక్షిత దాడులు జరపాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయం బీజేపీకి హవాకు కారణంగా చెప్పవచ్చు.