ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 10 మార్చి 2023 (20:17 IST)

ఓయో రూమ్స్ ఫౌండర్ రితేష్ తండ్రి మృతి.. కుమారుడి పెళ్లిని కళ్లారా చూసి?

OYO Founder
OYO Founder
ఓయో రూమ్స్ వ్యవస్థాపకుడు రితేష్ అగర్వాల్ తండ్రి రమేష్ అగర్వాల్ శుక్రవారం మధ్యాహ్నం హర్యానాలోని గురుగ్రామ్‌లో ఎత్తైన భవనంపై నుండి పడి మరణించినట్లు పోలీసులు తెలిపారు. సెక్టార్ 54, గురుగ్రామ్‌లోని DLF  ది క్రెస్ట్ సొసైటీ 20వ అంతస్థు నుండి రితేష్ పడినట్లు పోలీసులకు సమాచారం అందింది. 
 
ఆపై రితేష్‌ను చికిత్స కోసం పరాస్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. రితేష్ అగర్వాల్ ఒక ప్రకటనలో, "బరువైన హృదయంతో, నా కుటుంబం, నేను వున్నాం. మా నాన్న శ్రీ రమేష్ అగర్వాల్ మార్చి 10న మరణించారు. అతను పూర్తి జీవితాన్ని గడిపాడు. నాకు స్ఫూర్తినిచ్చాడు. ఆ మరణం మా కుటుంబానికి తీరని లోటు." అంటూ సోషల్ మీడియాలో రితేష్ అగర్వాల్ పోస్టు చేశారు. 
 
రమేష్ అగర్వాల్ మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. రమేష్ అగర్వాల్ తన 29 ఏళ్ల కుమారుడు ఓయో వ్యవస్థాపకుడైన రితేష్ అగర్వాల్ వివాహంలో కనిపించారు. ఈ జంటకు మార్చి 7న ఢిల్లీలోని ఫైవ్ స్టార్ తాజ్ ప్యాలెస్ హోటల్‌లో హై ప్రొఫైల్ వెడ్డింగ్ రిసెప్షన్‌ను నిర్వహించారు.