శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 24 నవంబరు 2016 (16:51 IST)

జమ్మూ-కాశ్మీర్ విషయంలో భారత్‌ను ఎలా డీల్ చేయాలో తెలుసు: అమన్

పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ సోహెయిల్ అమన్ కూడా భారత్‌కు వార్నింగ్ ఇచ్చారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కాశ్మీర్ విషయంలో భారత్‌ను ఎలా డీల్ చేయాలో తమకు బాగా తెలుసునంటూ ధీమా వ్యక్తం చేశా

పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ సోహెయిల్ అమన్ కూడా భారత్‌కు వార్నింగ్ ఇచ్చారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కాశ్మీర్ విషయంలో భారత్‌ను ఎలా డీల్ చేయాలో తమకు బాగా తెలుసునంటూ ధీమా వ్యక్తం చేశారు. వాస్తవాదీన రేఖ వెంబడి రెండు దేశాల మధ్య హింసాత్మక సంఘటనలు పెరిగిపోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని, అయినా తమకు ఎలాంటి ఆందోళన లేదని అమన్ పేర్కొన్నారు. 
 
భారత​ ఆర్మీ జరిపిన కాల్పుల్లో 12మంది పౌరులు ముగ్గురు తమ జవాన్లు చనిపోయినట్లు పాక్‌ తెలిపింది. ఈ నేపథ్యంలో కరాచీలో అమన్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఇలాంటి చర్యలకు భారత్ బ్రేక్ వేస్తే మంచిదన్నారు. వివాదాన్ని పెంచుకుంటూ పోతే పాకిస్థాన్ సైన్యం కూడా అదే పని చేసేందుకు వెనుకాడదని, ఈ విషయంలో భారత్‌తో ఎలా ముందుకెళ్లాలో తమకు బాగా తెలుసునని వార్నింగ్ ఇచ్చాడు.