సోమవారం, 18 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 6 డిశెంబరు 2016 (12:53 IST)

పన్నీర్ సెల్వం భరతుడు.. అమ్మ ఫోటో పెట్టే అంతా.. ఓపీ అమ్మకు ఎందుకు అంత క్లోజ్..

అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు తర్వాత ఆ పార్టీలో బలంగా వినిపిస్తున్న పేరు పన్నీర్ సెల్వం. అమ్మ తుదిశ్వాస విడివగానే అమ్మ బాధ్యతలను సీఎంగా పన్నీర్ సెల్వం చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందుకు కారణం అమ్మతో ఆయ

అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు తర్వాత ఆ పార్టీలో బలంగా వినిపిస్తున్న పేరు పన్నీర్ సెల్వం. అమ్మ తుదిశ్వాస విడివగానే అమ్మ బాధ్యతలను సీఎంగా పన్నీర్ సెల్వం చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందుకు కారణం అమ్మతో ఆయనకున్న సన్నిహితమే కారణమని పార్టీ వర్గాలు అంటున్నాయి. అమ్మకు పన్నీర్ సెల్వం మాత్రం ఎందుకంత క్లోజ్ అంటూ అందరూ మాట్లాడుకుంటున్నారు. 
 
పార్టీలో సీనియర్ నేతలున్నా ఏ విషయమైనా పన్నీరుతోనే సెపరేట్‌గా చర్చించేవారట. అధినేత్రి ఇంటికి వెళ్లాలన్నా ఆయన ఒక్కరు మాత్రమే వెళ్లేవారు. ఇంతకీ పన్నీరుసెల్వం వెనుక స్టోరీ ఏంటి? ఇంకా లోతుల్లోకి వెళ్తే... 63 ఏళ్ల పన్నీరుసెల్వం అంటే ఒకప్పుడు ఎవరికీ తెలియని పేరు.
 
తమిళనాడులోని పెరియకుళంలో ఆయనకు చిన్న టీ కొట్టు వుండేది. ఆ టీ షాపు ఇప్పటికీ నడుస్తోంది. బీఏ చదివిన ఆయన ఎంజీఆర్‌కు వీరాభిమాని. ఎంజీఆర్ మరణించాక తర్వాత కొంతకాలానికి జయలలిత వర్గంలోకి వచ్చారు. జయ ఫ్రెండ్ శశికళ సామాజికవర్గం 'దేవర్'కు చెందినవారు.
 
అన్నాడీఎంకెలో ఈ వర్గానిదే ఆధిపథ్యం. కేబినెట్‌లోనూ ఈ వర్గానిదే హవా. 1996-2001ల మధ్య పురపాలక సంఘం ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన పన్నీరు... ఇక వెనుదిరిగి చూసుకోలేదు. 2001 నుంచి జయ కేబినెట్‌లో రెవెన్యూ, ఎక్సైజ్, ప్రజాపనులశాఖ మంత్రిగా పనిచేసిన ఆయన, ఇప్పుడు తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 2011 నుంచి తమిళనాడు ఆర్థికమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సెల్వం, సోమవారం వరకు ఆశాఖలో కొనసాగుతూ వచ్చారు. ఇలా అమ్మ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించేవారు.  
 
అంతేకాదు ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లోనూ జయలలిత, శశికళను దోషులుగా న్యాయస్థానం పేర్కొన్నప్పడు కూడా, జయ కన్నుసన్నల్లోనే పాలన సాగేది. చివరకు జయ తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లిన సమయంలోనూ కీలకమైన విషయాలపై కేబినెట్ సమావేశం జరిగినా, అధినేత్రి కుర్చీలో కూర్చోకుండా తన సీట్లోనే అమ్మ ఫోటోని పెట్టుకున్న సమావేశం కొనసాగించిన భరతుడు ఈ పన్నీరుసెల్వం.
 
ఇదిలా ఉంటే.. జయలలిత మృతికి రాష్ట్ర సచివాలయం సంతాపం తెలిపింది. సంతాప సూచకంగా ఉద్యోగులు రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు.. జయలలిత చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జయలలిత జీవితంలో అనేకపోరాటాలు చేశారని, 75 రోజులపాటు మృత్యువుతో పోరాడారని అన్నారు. 
 
జయ చక్కగా తెలుగు మాట్లాడతారని, అనేక తెలుగు చిత్రాల్లో ఆమె నటించారన్నారు. జాతీయ రాజకీయాల్లో కలిసి పనిచేశామని గుర్తుచేసుకున్నారు. జయ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు.