గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 28 జనవరి 2021 (11:17 IST)

సెంచరీ కొట్టిన పెట్రోల్‌!

దేశ చరిత్రలోనే పెట్రోల్‌ ధర తొలిసారి సెంచరీ కొట్టింది. రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో లీటర్‌ ప్రీమియం పెట్రోల్‌ ధర రికార్డు స్థాయిలో రూ.101.15కు పెరిగింది. దేశంలో కొద్ది రోజులుగా చమురు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి.

లీటర్‌ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు  25 పైసల చొప్పున పెరిగాయి. దీంతో రాజస్థాన్‌లో లీటర్‌ ప్రీమియం పెట్రోల్‌ ధర రూ.101.15కు, సాధారణ పెట్రోల్‌ ధర రూ.98.40కు పెరిగింది. తాజా ధరల పెంపుతో ఢిల్లీలో సాధారణ పెట్రోల్‌ రేటు రూ. 86.30కు, లీటర్‌ డీజిల్‌ ధర రూ. 76.23కు పెరిగింది.