మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Raju
Last Updated :హైదరాబాద్ , బుధవారం, 19 ఏప్రియల్ 2017 (09:11 IST)

దినకరన్ పని అయిపోయినట్లే: లుకవుట్ ప్రకటించిన క్రైం బ్రాంచ్. దేశం దాటిపోకుండా దిగ్బంధనం

అన్నాడిఎంకే అమ్మ వర్గం అధినేత (ఈ బుధవారం నుంచి కాదు) శశికళ మేనల్లుడు, అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి టీవీవీ దినకరన్‌ని డిల్లీ పోలీసు విభాగానికి చెందిన క్రైం బ్రాంచ్ అష్ట దిగ్బంధనం చేసింది. అతడి జాడ

అన్నాడిఎంకే అమ్మ వర్గం అధినేత (ఈ బుధవారం నుంచి కాదు) శశికళ మేనల్లుడు, అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి టీవీవీ దినకరన్‌ని డిల్లీ పోలీసు విభాగానికి చెందిన క్రైం బ్రాంచ్ అష్ట దిగ్బంధనం చేసింది. అతడి జాడ కనిపెట్టడానికి లుకవుట్ నోటీసు ప్రకటించడమే కాకుండా దేశం నుంచి దాటిపోకుండా చూడటానికి ఓడరేవులు, విమానాశ్రయాలను అప్రమత్తం చేసింది. ప్రవాస భారతీయుడైన దినకరన్ దేశం విడిచి పారిపోయే అవకాశం ఉందని అనుమానిస్తున్న నేపథ్యంలో తనను అరెస్టు చేసేందుకు ఈ లుకవుట్ నోటీసు ఉపయోగపడుతుందని ఢిల్లీ పోలీసులు తెలిపారు. దినకరన్ చుట్టూ చక్రబంధం  అల్లామని క్రైమ్ బ్రాంచ్ జాయింట్ కమిషనర్ ప్రవీర్ రాజన్ నిర్ధారించారు కాని వివరాలు చెప్పడానికి తిరస్కరించారు. 
 
దినకరన్ దేశంనుంచి తప్పించుకు పోవడానికి ప్రయత్నం చేస్తూండవచ్చని అతడి సహచరుడే పోలీసులుకు తెలిపిన నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. దేశీయ రవాణా మార్గాలన్నింటా నిఘా పెట్టారు.  అన్నా డీఎంకే (అమ్మ) నాయకుడు టీటీవీ దినకరన్‌ కోసం ఢిల్లీ పోలీసులు త్వరలో చెన్నైకి ఓ బృందాన్ని పంపించనున్నారు. తమ వర్గానికి రెండాకుల చిహ్నం కేటాయించేలా చూడడం కోసం ఎన్నికల కమిషన్‌ అధికారికి దినకరన్‌ లంచం ఇవ్వజూపారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెల్సిందే. బ్రోకర్‌ సుకేష్‌ చంద్రశేఖర్‌ను అరెస్టు చేసిన వెంటనే దినకరన్‌పై కూడా పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేశారు. కాగా చంద్రశేఖర్‌ను వరుసగా మూడో రోజైన మంగళవారం కూడా క్రైమ్‌బ్రాంచ్‌ అధికారులు విచారించారు.