బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 19 ఆగస్టు 2018 (11:05 IST)

బాయ్‌ఫ్రెండ్ ప్రేమ పేరుతో కన్నెరికంపై కాటేశాడు.. ఇన్‌స్ట్రాగ్రామ్‌లో లైవ్‌ పెట్టి ప్రియురాలి సూసైడ్

ప్రేమ ప్రేరుతో ప్రియుడు మోసం చేయడమే కాకుడా, తన కన్నెరికంపై కాటేయడంతో ఆ యువతి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన పంజాబ్ రాష్ట్రంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,

ప్రేమ ప్రేరుతో ప్రియుడు మోసం చేయడమే కాకుడా, తన కన్నెరికంపై కాటేయడంతో ఆ యువతి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన పంజాబ్ రాష్ట్రంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే..
 
హోషియాపూర్‌ జిల్లాకి చెందిన మనీషా (18) అనే యువతి ఫగ్వారాలో ఓ అపార్ట్‌మెంట్‌లో అద్దెకు ఉంటుంది. ఈ యువతికి అదే ప్రాంతానికి చెందిన ఇందర్ అనే యువకుడు పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ నేపథ్యంలో గత గురువారం రాత్రి ఆమె ఇన్‌స్ట్రాగ్రామ్‌లో లైవ్‌ పెట్టి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.
 
'నా బాయ్‌ఫ్రెండ్‌ ఇందర్‌ నాకు ద్రోహం చేశాడు. ప్రేమ పేరుతో మోసం చేశాడు. నా శీలాన్ని కూడా దోచుకున్నాడు. అది నేను తట్టుకోలేక పోతున్నా. అందుకే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నా' అని లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.