గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 16 జనవరి 2017 (05:36 IST)

మోడీనే కాదు.. హిట్లర్‌, ముస్సోలినీ కూడా శక్తివంతమైన బ్రాండ్లే : రాహుల్

దేశ కరెన్సీ నోట్లపై జాతిపిత మహాత్మా గాంధీ బొమ్మ ఉండటం వల్లే కరెన్సీ విలువ పడిపోతుందంటూ హర్యానా మంత్రి అనిల్ విజ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్విట్టర్‌లో తీవ్రంగా స్పందించారు.

దేశ కరెన్సీ నోట్లపై జాతిపిత మహాత్మా గాంధీ బొమ్మ ఉండటం వల్లే కరెన్సీ విలువ పడిపోతుందంటూ హర్యానా మంత్రి అనిల్ విజ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్విట్టర్‌లో తీవ్రంగా స్పందించారు. హిట్లర్‌, ముస్సోలినీ కూడా శక్తివంతమైన బ్రాండ్లేనని వ్యంగ్యంగా అన్నారు.
 
అలాగే, కాంగ్రెస్ మీడియా విభాగం ముఖ్య ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా మాట్లాడుతూ.. 'గాంధీని చంపగలిగారు. ఆయన ఫొటోలు తీసేయగలిగారు. దేశ ప్రజల గుండెల్లోంచి ఆయన్ను తొలగించలేరు' అని వ్యాఖ్యానించారు.
 
అదేవిధంగా మహాత్మా గాంధీ ముని మనుమడు తుషార్‌ గాంధీ మాట్లాడుతూ.. 'హర్యానా మంత్రి హైకమాండ్‌ చెప్పినట్లు వింటున్నారని, ఆర్‌ఎ‌స్ఎస్‌ భాష మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు.
 
ఖాదీ, కుటీర పరిశ్రమల కమిషన్‌ తాజా కేలండర్‌లో గాంధీకి బదులుగా ప్రధాని మోడీ ఫొటో వేయడంపై వ్యక్తమైన విమర్శలకు మంత్రి అనిల్ విజ్ స్పందించారు. "ఖాదీపై గాంధీ పేరుకేమీ పేటెంట్‌ లేదు. ఖాదీకి గాంధీ పేరును లింకు చేసినప్పటి నుంచే పరిశ్రమ పతనమైపోయింది. గాంధీ బొమ్మను కరెన్సీ నోట్లపై వేసినప్పటి నుంచి రూపాయి విలువ తగ్గడమే కానీ పెరగడం లేదు" అని విజ్‌ వ్యాఖ్యానించారు.