గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 25 మార్చి 2023 (13:13 IST)

అప్పీల్ చేసుకోకపోతే.. రాహుల్ గాంధీ బంగ్లా ఖాళీ చేయాల్సిందే..

rahul gandhi
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి కష్టాలు తప్పేలా లేవు. ఎంపీగా అనర్హతకు గురైన నేపథ్యంలో రాహుల్ గాంధీ వుంటున్న తుగ్లక్ రోడ్డులోని 12వ నెంబర్ బంగ్లాను ఖాళీ చేయాల్సి వుంటుంది. మోదీ అనే ఇంటిపేరును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల కేసు తీర్పు పర్యవసానంగా రాహుల్ గాంధీపై కేసు నమోదు అయ్యింది. 
 
ఈ పరువు నష్టం కేసులో భాగంగా సూరత్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించడంతో ఎంపీగా ఆయనపై అనర్హతకు గురయ్యారు. తమ తీర్పుపై అప్పీల్ చేసుకోవడానికి కోర్టు ఆయనకు 30 రోజుల సమయాన్ని ఇచ్చింది. దీంతో, ఈలోగా ఆయన తనకు విధించిన శిక్షపై హైకోర్టులో స్టే తెచ్చుకోవాల్సి ఉంది. 
 
లేనిపక్షంలో రాహుల్ బంగ్లాను కూడా ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2004లో లోక్ సభకు ఎన్నికైనప్పటి నుంచి ఆయనకు ఈ బంగ్లాను కేటాయించారు.