గ్యాస్ కనెక్షన్ పేరుతో కూల్‌డ్రింక్స్‌లో మత్తు కలిపి చెరిశాడు...
గ్యాస్ కనెక్షన్ పేరుతో ఓ మహిళకు కూల్‌డ్రింక్స్‌లో మత్తుమందు కలిపి అత్యాచారం చేశాడు. ఇది రాజస్థాన్ రాష్ట్రంలోని నాగౌర్ జిల్లాలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, వంట గ్యాస్ కనెక్షన్ కోసం ఓ మహిళ స్థానికంగా ఉండే కియోస్క్‌కు వెళ్లింది. అక్కడ ఆ మహిళకు ఓ వ్యక్తి పరిచయమయ్యాడు.
తాను గ్యాస్ కనెక్షన్ ఇప్పిస్తానని ఆ మహిళకు ఆ వ్యక్తి నమ్మించాడు. ఆ తర్వాత కుచమాన్ నగరానికి తీసుకువెళ్లి మత్తుమందు కలిపిన పానీయాన్ని ఇచ్చి మరొకరితో కలిసి సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డాడు.
కాగా, వారు ఈ ఘోరాన్ని వీడియోలో రికార్డు చేశారు. యువతి ఫిర్యాదుతో నిందితులు ముఖేష్, కిషోర్‌లపై కేసు నమోదు చేశారు. నిందితుల కోసం గాలిస్తున్నామని, త్వరలో వారిని అదుపులోకి తీసుకుంటామని డీఎస్పీ సురేష్ కుమార్ సన్వరియా తెలిపారు.