శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 20 జనవరి 2021 (13:58 IST)

ఇక రైళ్లలోనూ రెడీ టూ ఈట్‌ మీల్స్‌ సదుపాయం!

రైల్వే ప్రయాణీకులకు సేవలందిస్తూనే ఆదాయాన్ని పెంచుకోవాలని రైల్వే శాఖ భావిస్తోంది. ఈ నేపథ్యంలో రైలు ప్రయాణీకులకు రెడీ-టు-ఈట్‌ మీల్స్‌ సదుపాయాన్ని కల్పించాలని చూస్తోంది. ఈ ప్రాజెక్టు కోసం రైల్వేశాఖ ఇప్పటికే హల్దీరామ్స్‌, ఐటిసి, ఎంటిఆర్‌, వాఫ్‌ుబక్రి వంటి ప్రముఖ ఆహార సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు సమాచారం.

కరోనాతో కుదైలైన రైల్వే రంగాన్ని గాడిలో పెట్టడంతో పాటు ఇటువంటి సేవలను తీసుకువచ్చి ఐఆర్‌సిటిసి ఆదాయం పెంచుకోవాలని రైల్వే శాఖ యోచిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రెడీ టు ఈట్‌ సదుపాయాలను తీసుకురానుంది.

త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో దీనిపై కేంద్రం దీనిపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. రెడీ-టు-ఈట్‌ మీల్‌ విధానం ఇప్పటికే విమాన సర్వీసుల్లో అమలవుతోంది.

ఈ సేవల నుండి ఆయా విమానయాన సంస్థలు మంచి ఆదాయాన్ని గడిస్తున్నాయి. దీంతో ఇదే విధానాన్ని రైల్వేలో కూడా అమలుచేయాలని అధికారులు నిర్ణయించారు.