గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 26 డిశెంబరు 2023 (17:43 IST)

శబరిమలలో భక్తుల రద్దీ... రూ.200 కోట్లు దాటిన ఆదాయం

sabarimala
కేరళలో శబరిమల అయ్యప్పకు భక్తులు పోటెత్తుతున్నారు. ఈ ఏడాది అయ్యప్పను దర్శించుకునేందుకు వచ్చిన వారితో శబరిమల ఆదాయం రూ.200 కోట్లు దాటింది. 39 రోజుల క్రితం ప్రారంభమైన అయ్యప్ప దర్శనాల్లో భాగంగా ఇప్పటివరకు 31 లక్షల మంది శబరిమల అయ్యప్పను దర్శించుకున్నట్లు ఆలయ బోర్డు వెల్లడించింది. ఇందులో కానుకల రూపంలో రూ. 63.89 కోట్లు రాగా.. అర‌వ‌న ప్ర‌సాదం ద్వారా రూ. 96.32 కోట్ల ఆదాయం ఆలయానికి వ‌చ్చిందని తెలిపింది. 
 
ఇక ఈ మండ‌ల విరక్కు పూజ కాలంలో డిసెంబర్ 25 వ తేదీ నాటికి 39 రోజుల్లో 31,43,163 మంది భ‌క్తులు అయ్య‌ప్ప‌ను ద‌ర్శించుకున్నట్లు ట్రావెన్ కోర్ బోర్డు వెల్లడించింది. రేపు డిసెంబర్ 27న మూతపడనున్న అయ్యప్ప ఆలయం.. మ‌క‌ర‌విల‌క్కు పండుగ కోసం మ‌ళ్లీ డిసెంబ‌ర్ 30వ తేదీన శబరిమల ఆల‌యాన్ని తెర‌వ‌నున్నట్లు స్పష్టం చేసింది.