బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 24 డిశెంబరు 2017 (11:12 IST)

#RKNagarElectionResult : 3వ రౌండ్ పూర్తి.. కొనసాగుతున్న టీటీవీ ఆధిక్యం

చెన్నై, ఆర్.కె నగర్ ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన టీటీవీ దినకరన్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మూడో రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సమయానికి దినకరన్‌కు 15,868 ఓట్లు రాగా, అధికార అన్నాడీఎంకే అభ్యర్థి మధుసూదనన్‌కు 7,033 ఓట్లు, డీఎంకే అభ్య

చెన్నై, ఆర్.కె నగర్ ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన టీటీవీ దినకరన్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మూడో రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సమయానికి దినకరన్‌కు 15,868 ఓట్లు రాగా, అధికార అన్నాడీఎంకే అభ్యర్థి మధుసూదనన్‌కు 7,033 ఓట్లు, డీఎంకే అభ్యర్థి మరుదుగణేష్‌కు 3,750 ఓట్లు, బీజేపీ అభ్యర్థి కరు నాగరాజన్‌కు 117 ఓట్లు పోలయ్యాయి. 
 
ముఖ్యమంత్రి దివగంత జయలలిత మరణంతో ఈ స్థానానికి ఈనెల 21వ తేదీన పోలింగ్ జరుగగా, ఆదివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం టీటీవీ దినకరన్ గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు. 
 
వాస్తవానికి ఈ ఎన్నికల్లో దినకరన్‌ను ఓటర్లు తిరస్కరిస్తారని, ప్రధాన పోటీ అన్నాడీఎంకే, డీఎంకే మధ్య సాగుతుందని రాజకీయ విశ్లేషకులు వేసిన ముందస్తు అంచనాలు తలకిందులు అయ్యేట్టు కనిపిస్తోంది. ఇప్పటికే దినకరన్ వర్గం కౌంటింగ్ కేంద్రం వద్ద సందడి చేస్తుండటం కనిపిస్తోంది. గెలిచేది తామేనని, భవిష్యత్ సీఎం దినకరన్ అని వారు నినాదాలు చేస్తున్నారు.