కాంగ్రెస్ పార్టీకి కష్టాలు తెచ్చిపెట్టిన రోహిత్ వేముల కేసు
హైదరాబాద్ యూనివర్శిటీకి చెందిన రీసెర్చ్ స్కాలర్ రోహిత్ వేముల దళితుడు కాదంటూ పోలీసులు కేసును కొట్టిపారేయడం కాంగ్రెస్ పార్టీకి తీవ్ర వివాదానికి ఇబ్బందికి దారితీసింది. విద్యాసంస్థల్లో దళితుల పట్ల వివక్ష చూపుతున్నారని ఆరోపిస్తూ, వేముల విషాదకరమైన ఆత్మహత్యను తన కథనానికి కేంద్ర బిందువుగా ఉపయోగించి కాంగ్రెస్ మోదీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది.
ఈ కేసుపై తిరిగి దర్యాప్తునకు ఆదేశించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వేగంగా స్పందించింది. రోహిత్ వేముల జనవరి 17, 2016న హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి హెచ్‌ఆర్‌డి మంత్రి స్మృతి ఇరానీ, అప్పటి కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయలను బర్తరఫ్ చేయాలని, వైస్ ఛాన్సలర్ అప్పారావును కూడా తొలగించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.
లోక్‌సభ ఎన్నికల కోసం తమ పార్టీ మ్యానిఫెస్టోలో రోహిత్ వేముల చట్టం పేరుతో ప్రత్యేక చట్టానికి హామీ ఇస్తుండగా, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఆ కేసు కొట్టివేత నివేదికను దాఖలు చేయడం కాంగ్రెస్ పార్టీకి కష్టాలను తెచ్చిపెట్టింది.