శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 4 మే 2024 (10:28 IST)

భార్యతో అసహజ శృంగారం తప్పేకాదు : మధ్యప్రదేశ్ హైకోర్టు

romance
అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్యతో అసహజ శృంగారం తప్పేకాదని మధ్యప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు 2019 నాటి కేసులో కోర్టు తీర్పును వెలువరించింది. వైవాహిక అత్యాచారం ప్రస్తావన భారతీయ చట్టాల్లో లేదని కోర్టు వ్యాఖ్యానించింది. సెక్షన్ 375 ప్రకారం 15 యేళ్ల పైబడిన భార్యతో భర్త శృంగారం చర్యలు అత్యాచారం కాదని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో "అసహజ శృంగారానికి భార్య అనుమతి" అనే అంశానికి ప్రాధాన్యత ఉండదని వ్యాఖ్యానించింది.
 
భర్త తనతో పలుమార్లు అసహజ శృంగారంలో పాల్గొన్నాడంటూ ఓ మహిళ 2019లో భర్తపై కేసు పెట్టింది. ఇందుకు సంబంధించిన ఎఫ్ఐఆర్‌ను కొట్టేయాలంటూ మహిళ భర్త మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించాడు. సెక్షన్ 377 ప్రకారం భార్యాభర్తల మధ్య అసహజ శృంగారం అత్యాచారం కింద పరిగణించలేమని అతడి న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ కేసుపై న్యాయమూర్తి గురుపాల్ సింగ్ అహ్లువాలియా వాదనలు ఆలకించి తీర్పును వెలువరించారు. ఐపీసీ సెక్షన్ 375 ప్రకారం 15 యేళ్ల పైబడిన భార్యతో భర్త శృంగారం చర్య అత్యాచారం కిందకు రాదు. వైవాహిక అత్యాచారాన్ని నేరంగా భారతీయ చట్టాలు ఇంకా గుర్తించలేదు. 
 
ఈ నేపథ్యంలో అసహజ శృంగారానికి భార్య అనుమతి  అంశం ప్రాదానంయ కోల్పోతుంది. తనతో పాటు ఉంటున్న భార్యతో భర్త అసహజ శృంగారం నేరం కాదని సెక్షన్ 377 చెబుతుంది. అని న్యాయమూర్తి పేర్కొన్నారు. అయితే, సెక్షన్ 376 బి ప్రకారం విడిగా ఉంటున్న భార్యతో ఆమె అనుమతి లేకుండా శృంగారం చేయడం అంటే అత్యాచారమేనని స్పష్టం చేసింది. ఈ కేసులో అసహజ శృంగారాన్ని అత్యాచారంగా పరిగణించలేమని పేర్కొంది.