గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 28 ఏప్రియల్ 2024 (12:30 IST)

భర్త లేని సమయంలో మహిళపై మరిది అత్యాచారం...

victim woman
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఇంట్లో భర్త లేని సమయంలో మహిళపై మరిది అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన భర్తకు భార్య తనకు జరిగిన ఘోరాన్ని వివరించింది. ఆయన ఆమెను ఓదార్చాల్సిన భర్త ఆమెపైనే హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని ముజఫర్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ముజఫర్ నగర్ జిల్లాకు చెందిన మహిళపై ఈ నెల 2వ తేదీన అత్యాచారం జరిగింది. ఆమె భర్త ఊళ్లో లేని సమయం చూసి ఆమెపై మరిది అత్యాచారానికి పాల్పడ్డారు. నిస్సహాయంగా మిగిలిపోయిన ఆ మహిళపై పడి తన కామవాంఛ తీర్చుకున్నాడు. ఊరెళ్లిన భర్త ఇంటికి తిరిగి వచ్చాక విషయం చెప్పి బోరున విలపించింది. అయితే, భార్య చెప్పింది విన్న ఆ ప్రబుద్ధుడు నువ్వు ఇక నా భార్యవు కాదు. నా తమ్ముడు నీపై అత్యాచారం చేశాడు. కాబట్టి ఇకపై నువ్వు మరదలువు అంటూ పిచ్చి కూతలు కూాడు. ఆ మరుసటి రోజు తన తమ్ముడితో కలిసి వచ్చి భార్యను చంపేందుకు ప్రయత్నించాడు. 
 
బాధితురాలిపై కూర్చొని మెడకు చున్నీ బిగించి చంపాలని చూశాడు. బాధితురాలిపై అత్యాచారం చేసిన వ్యక్తి దీనిని తన సెల్‌ఫోన్‌లో రికార్డు చేశాడు. ఈ హత్యాయత్నం నుంచి తప్పించుకున్న బాధితురాలు సెల్‌ఫోనుతో సహా పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. తనపై జరిగిన ఘోరాన్ని, కట్టుకున్నవాడే తనను కడతేర్చేందుకు చేసిన ప్రయత్నాన్ని పోలీసులకు వివరించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న ఇద్దరు అన్నదమ్ముల కోసం గాలిస్తున్నారు.