మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 31 మే 2018 (10:22 IST)

మహారాష్ట్ర వ్యవసాయ మంత్రి ఆకస్మిక మృతి... మోడీ సంతాపం

మహారాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి పాండురంగ్ ఫండ్కర్ ఆకస్మిక మృతి చెందారు. ఆయన వయసు 67 యేళ్లు. ఆయన గురువారం ఉదయం ముంబైలోని సోమయ్య హస్పిటల్ మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.

మహారాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి పాండురంగ్ ఫండ్కర్ ఆకస్మిక మృతి చెందారు. ఆయన వయసు 67 యేళ్లు. ఆయన గురువారం ఉదయం ముంబైలోని సోమయ్య హస్పిటల్ మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.
 
గత కొన్నిరోజులుగా గుండె సంబంధిత వ్యధితో బాధపడుతున్న పాండురంగ్‌కు గురువారం ఉదయం గుండెపోటు వచ్చి మరిణించినట్లు తెలిపారు. మహారాష్ట్రలో బీజేపీ సీనియర్ నేతగా గుర్తింపు పొందిన పాండురంగ్.. అకోలా నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. 
 
పాండురంగ్ ఫండ్‌కర్ మృతిపట్ల ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ ద్వారా సంతాపం తెలిపారు. అలాగే, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కూడా సంతాపం తెలిపారు. కాగా, మంత్రి అంత్యక్రియలు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో జరుగనున్నాయి.