సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 28 మే 2018 (16:04 IST)

యోగిని చెప్పుతో ముఖంపై కొట్టాలనిపించింది : ఉద్ధవ్ ఠాక్రే

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యోగిని ఆయన వేసుకునే చెప్పుతోనే ముఖంపై కొట్టాలనిపించిందని ఆయన అన్నారు. ఇదే అంశంపై ఆయన పార్టీ

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యోగిని ఆయన వేసుకునే చెప్పుతోనే ముఖంపై కొట్టాలనిపించిందని ఆయన అన్నారు. ఇదే అంశంపై ఆయన పార్టీ అధికారిక పత్రిక సామ్నాలో ఓ కథనం రాశారు.
 
మహారాష్ట్రంలోని పాల్ఘర్‌లో ఎన్నికల ప్రచారం నిమిత్తం యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఇటీవల పర్యటించారు. ఈ ప్రచారంలో భాగంగా మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలదండ వేశారు. అయితే, యోగి తాను ధరించిన చెప్పులు విడవకుండానే ఆ విగ్రహానికి పూల దండ వేయడాన్ని ఉద్ధవ్ తీవ్రంగా తప్పుబట్టారు. 
 
దీనిపై ఉద్ధవ్ స్పందిస్తూ, 'ఆదిత్యానాథ్‌ చెప్పులు వేసుకునే.. ఛత్రపతి చిత్రపటానికి పూలమాల సమర్పించారు. ఆ సమయంలో యోగి చెప్పులు తీసి, వాటితో అతని ముఖాన్ని కొట్టాలనిపించింది' అని శివసేన అధికార పత్రిక సామ్నాలో పేర్కొన్నారు.
 
దీనిపై యోగి ఆదిత్యనాథ్ కూడా తక్షణం స్పందించారు. ఉద్ధవ్ ఠాక్రేకు వాస్తవం ఏంటో తెలియదని, ఆయన నుంచి సభ్యతాసంస్కారాలు నేర్చుకోవాల్సిన అవసరం తనకు లేదని బదులిచ్చారు. మహనీయులకు, గొప్ప వ్యక్తులకు ఎలా నివాళులర్పించాలో తనకు తెలుసని, ఉద్ధవ్ నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదని అన్నారు.