శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 22 మే 2018 (14:53 IST)

మత్స్య కన్యను పోలిన వింత శిశువు జననం.. ఎక్కడ?

మన పురాణాలు, శాస్త్రాలు చెప్పినట్టుగా మత్స్యకన్యను పోలిన వింత శిశువుకు ఓ మహిళ జన్మినిచ్చింది. అయితే, అచ్చం మత్స్య కన్యను పోలినట్టుండే ఈ శిశువు పట్టుమని 10 నిమిషాలు కూడా ప్రాణాలతో ఉండలేక పోయింది. తాజాగ

మన పురాణాలు, శాస్త్రాలు చెప్పినట్టుగా మత్స్యకన్యను పోలిన వింత శిశువుకు ఓ మహిళ జన్మినిచ్చింది. అయితే, అచ్చం మత్స్య కన్యను పోలినట్టుండే ఈ శిశువు పట్టుమని 10 నిమిషాలు కూడా ప్రాణాలతో ఉండలేక పోయింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
మహారాష్ట్రలోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ మహిళ డెలివరీ కోసం చేరింది. ఈమెకు మత్స్య కన్యను పోలిన శిశువుకు జన్మనిచ్చింది. ఆ శిశువుకు అందరికీ ఉన్నట్లు తల, చేతులు మామూలుగానే ఉన్నాయి. కానీ రెండు కాళ్లు పూర్తిగా కలిసి పోవడంతో ఆ శిశువు చేప కన్యలా ఉంది. 
 
ఆ మహిళ గర్భం ధరించిన తర్వాత ఎలాంటి బలవర్ధక మాత్రలు వాడలేదట. ఈ కారణంగానే రెండు కాళ్లు కలసిపోయి ఉంటాయని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. పుట్టిన ఆ వింత శిశువు శరీరంలోని పైభాగం అవయవాలు పని చేస్తుండగా, కిందిభాగం మొత్తం కలసిపోవడంతో చేప ఆకారంలో కనిపించింది. ఈ శిశువు పుట్టిన 10 నిమిషాలకే చనిపోవడం గమనార్హం.