గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Raju
Last Updated :హైదరాబాద్ , శనివారం, 15 జులై 2017 (11:22 IST)

ఆడ ఆఫీసర్ నోరిప్పకూడదట. మగాఫీసరు మాత్రం ఏమైనా మాట్లాడొచ్చు.. ఇదేందప్పా సిద్ధప్పా

ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఒక మగ పోలీసు అధికారిని వెనకేసుకు వస్తూ అతడి అవినీతిని బయటపెట్టిన మహిళా అధికారికి మెమో పంపడం ఏమిటి? నిబంధనలకు వ్యతిేకంగా మీడియాతో మాట్లాడుతున్నారని హెచ్చరించడం ఏమి

ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఒక మగ పోలీసు అధికారిని వెనకేసుకు వస్తూ అతడి అవినీతిని బయటపెట్టిన మహిళా అధికారికి మెమో పంపడం ఏమిటి? నిబంధనలకు వ్యతిేకంగా మీడియాతో మాట్లాడుతున్నారని హెచ్చరించడం ఏమిటి? ఈ గొడవలో శశికళకు ప్రత్యేక సౌకర్యాల కల్పన అనే అసలు విషయం పక్కకు పోవడం ఏమిటి? కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తాను అక్షరాలా పురుష పక్షపాతిని అని నిరూపించుకున్నారు. పరప్పన అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న అన్నాడిఎంకే నాయకురాలు శశికళకు రెండు కోట్ల రూపాయల ముడుపులు తీసుకుని రాజభోగాలు కల్పించారంటూ అక్కడ జైళ్లశాఖ డీజీపీపై ఆ మహిళా ఐపీఎస్ చేసిన ఆరోపణలు సంచలనం కలిగిస్తుండగా సీఎం సిద్ధరామయ్య ఆరోపణలకు గురైన డీజీపీ తరపున వకాల్తా పుచ్చుకోవడం ఆశ్చర్యం గొలుపుతోంది. 
 
అన్నాడీఎంకే నాయకురాలు శశికళకు జైల్లో రాజభోగాలు అందుతోన్న వ్యవహరాన్ని బయటపెట్టిన కర్ణాటక జైళ్ల శాఖ డీఐజీ రూపా మౌడ్గిల్‌‌ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సర్వీస్ నిబంధనలు అతిక్రమించిందనే కారణంతో కర్ణాటక ప్రభుత్వం ఆమెకు నోటీసులు అందజేసింది. దీనిపై రూపా స్పందిస్తూ.. నన్ను టార్గెట్ చేయడం సరికాదు. తప్పు చేసిన వారందరిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రూప సర్వీస్ నిబంధనలను మీరి ప్రవర్తిస్తున్నారని, ఆమె నిబంధనలకు విరుద్ధంగా మీడియాతో ఎక్కువగా మాట్లాడుతున్నారని కర్ణాటక ప్రభుత్వం అంతకు ముందే హెచ్చరించింది. కాగా, ఈ ఆరోపణలను రుపా తోసిపుచ్చారు. తను నిబంధనలను అతిక్రమించలేదని స్పష్టం చేశారు.
 
‘నేను ముందుగా మీడియాతో మాట్లాడలేదు. డీజీపీ ముందుగా ఈ వివరాలను మీడియాతో పంచుకున్నారు. కాబట్టి నాపై విచారణ చేపట్టాలనుకుంటే.. నిబంధనలను అతిక్రమించిన వారందరిపై విచారణ చేపట్టాలి’ అని రూపా డిమాండ్ చేశారు. బెంగుళూరులోని పరప్పన అగ్రహార జైల్లో ఖైదీగా ఉన్న శశికళకు అక్కడ సిబ్బంది సకల సదుపాయాలు కల్పిస్తున్నారని రూపా ఆరోపించారు. 
 
దీంతో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఆమెకు నోటీసులు జారీ చేశారు. ‘ఆమె మీడియాతో మాట్లాడటం నిబంధనలకు విరుద్ధం. జైలు అధికారులెవరైనా ఎవరైనా డబ్బు తీసుకొని శశికళను వీఐపీలా చూస్తుంటే.. ఆ విషయాన్ని తనపై స్థాయి అధికారికి తెలియజేయాలి. అంతేగానీ.. ఈ వివరాలు మీడియాకు ఇవ్వడం ఏంట’ని సిద్ధ రామయ్య మండిపడ్డారు. ఆమెకు నోటీసులు అందజేశాం. వాటికి సమాధానం ఇవ్వాలని కోరామని సీఎం తెలిపారు.
 
శశికళకు జైలు సిబ్బంది సకల సదుపాయాలు కల్పించి, ప్రత్యేకంగా ట్రీట్ చేస్తున్నారు. ఆమెకు నచ్చిన ఆహారాన్ని అందించడానికి జైల్లో ఏకంగా ప్రత్యేక వంటగదిని ఏర్పాటు చేశారు. ఆమె గదిలో సకల సదుపాయాలు, స్వేచ్ఛగా తిరిగేలా వెసులుబాటు కల్పించారు. అలాగే సందర్శకులకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. ఇందుకోసం జైలు అధికారులకు ఆమె రూ. 2 కోట్లు ముట్టజెప్పారు. ఈ విషయాలన్నింటినీ రూపా బయటపెట్టారు.