ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 22 ఆగస్టు 2017 (09:10 IST)

పనిష్మెంట్ ఇస్తానని గదికి తీసుకెళ్లి రేప్ చేశాడు.. 12 ఏళ్ల బాలిక శరీరంపై పంటి గాట్లు..?

క్రీడలు, వ్యాయామాలు చెప్పించాల్సిన పీటీ మాస్టార్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక స్కూలుకు లేటుగా వచ్చిందని పనిష్మెంట్ ఇచ్చేందుకు గదిలోకి తీసుకెళ్లిన పీటీ మాస్టర్ బాలికపై అత్యాచారం చేశాడు. ఈ ఘ

క్రీడలు, వ్యాయామాలు చెప్పించాల్సిన పీటీ మాస్టార్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక స్కూలుకు లేటుగా వచ్చిందని పనిష్మెంట్ ఇచ్చేందుకు గదిలోకి తీసుకెళ్లిన పీటీ మాస్టర్ బాలికపై అత్యాచారం చేశాడు. ఈ ఘటన బెంగళూరు నగరంలోని ఓ పేరున్న పాఠశాలలో చోటుచేసుకుంది.

ఉదయం తొమ్మిది గంటలకు స్కూలు ప్రారంభమవుతుండగా 12 ఏళ్ల కూతురిని తండ్రి పదిహేను నిమిషాలు ఆలస్యంగా బైక్‌పై వదిలి వెళ్లాడు. పాఠశాలకు ఆలస్యంగా వచ్చిన అమ్మాయిలను ఓ గదిలోకి తీసుకెళ్లి కొంచెం సేపు గోడకుర్చీ శిక్ష వేసి తరగతికి పంపించడం ఆ స్కూలు రూల్. 
 
అలా లేటుగా వచ్చిన ఆ అమ్మాయిని ఓ గదిలోకి తీసుకెళ్లి పీటీ టీచర్ ఆమెను లైంగికంగా వేధించాడు. దీన్ని బయటికి చెప్తే.. కొడతానని బెదిరించడంతో ఆ బాలిక జరిగిన అఘాయిత్యాన్ని ఎవరికీ చెప్పకుండా దాచేసింది. అయితే ఇంటికొచ్చిన బాలిక దుస్తులు మార్చుకుంటుండగా ఆమె శరీరంపై పలు చోట్ల కొరికిన గాయాలుండటాన్ని గమనించిన తల్లి.. బాలికను ఏం జరిగిందని అడిగేసరికి అసలు బాగోతం బయటపడింది.
 
దీంతో బాలిక తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యంతో పాటు తోటి ఉపాధ్యాయుల దృష్టికి విషయం తీసుకువచ్చినా పీటీ మాస్టర్‌ను వెనకేసుకుని రావడంతో.. ఇక లాభం లేదనుకున్న బాధితురాలి తల్లిదండ్రులు పీటీ మాస్టర్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు బాలికను వైద్యపరీక్ష కోసం ఆసుపత్రికి పంపిస్తే ఆమెపై అత్యాచారం జరిగిందని తేలింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.