మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 10 జనవరి 2021 (12:53 IST)

రజనీకాంత్ రాజకీయాల్లో రావాలని చెన్నైలో ఫ్యాన్స్ ధర్నా

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తన ఆనారోగ్య కారణంగా రాజకీయాల్లోకి రాలేనని స్పష్టంచేశారు. కానీ, ఆయన అభిమానులు మాత్రం పట్టువీడటం లేదు. రాజకీయాల్లోకి రావాల్సిందేనంటూ పట్టుబడుతున్నారు. 
 
ఇదే విషయాన్ని డిమాండ్ చేస్తూ వారు ఆదివారం చెన్నై నగరంలో భారీ ప్రదర్శన, ధర్నా చేశారు. రాజ‌కీయాల్లోకి రాకూడ‌ద‌ని ఆయ‌న తీసుకున్న నిర్ణయంపై మ‌రోసారి ఆలోచించాల‌ని కోరుతున్నారు. క్రియాశీల రాజ‌కీయాల్లోకి రానంటూ ఆయ‌న ఇటీవ‌ల చేసిన ప్ర‌క‌ట‌న‌ను వెన‌క్కి తీసుకోవాల‌ని వారు అంటున్నారు.
 
చెన్నైలోని వ‌ళ్లువార్ కొట్ట‌మ్‌లో జ‌రుగుతోన్న‌ ఈ ప్ర‌ద‌ర్శ‌న‌లో వంద‌లాది మంది ర‌జనీకాంత్ అభిమానులు పాల్గొని ఆ డిమాండ్ చేస్తున్నారు. త‌మిళ‌నాడులోని పలు చోట్ల కూడా అభిమానులు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. రజనీ మక్కల్ మండ్రమ్ తరఫున ఎవరూ ఆందోళనలో పాల్గొనకూడదని ఆ సంఘం చెప్పిన‌ప్ప‌టికీ వారు విన‌ట్లేదు.