సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 8 అక్టోబరు 2023 (12:02 IST)

ఐఐటీ ఢిల్లీ ఫెస్ట్‌లో దారుణం - విద్యార్థినుల వాష్ రూమ్‌లో సీక్రెట్ కెమెరాలు

cctv
ఐఐటీ ఢిల్లీ ఫెస్ట్‌ శుక్రవారం జరిగింది. ఇందులో దారుణ ఘటన ఒకటి జరిగింది. విద్యార్థినుల వాష్ రూమ్‌లో సీసీ టీవీ కెమెరాలు అమర్చారు. ఈ షో పాల్గొనేందుకు వచ్చిన భారతీయ కాలేజీ విద్యార్థినులు దుస్తులు మార్చుకునేందుకు వారు ఉపయోగించిన బాత్రూమ్‌లలో ఈ రహస్య కెమెరాలు అమర్చారు. వీటిని గుర్తించిన విద్యార్థినులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అక్కడ పని చేసే కాంట్రాక్ట్ స్వీకర్‌‌ను అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
ఐఐటీ ఢిల్లీ ఫెస్ట్‌లో భాగంగా ఓ ఫ్యాషన్ షో నిర్వహించారు. ఇందులో పాల్గొనేందుకు వచ్చిన విద్యార్థినులు దుస్తులు మార్చుకునేందుకు వీలుగా ఓ గతిని కేటాయించారు. ఇక్కడ రహస్యంగా సీసీటీవీ కెమెరాలు అమర్చారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు రంగంలోకి వెంటనే కాంట్రాక్ట్ స్వీపర్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై తాము ఫిర్యాదు చేసినా ఐఐటీ ఢిల్లీ యాజమాన్యం ఏమాత్రం పట్టించుకోలేదని బాధిత విద్యార్థినులు విచారమ విచారం వ్యక్తం చేశారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు.