కాలేజీ వాష్‌రూమ్‌లో వీడియో రికార్డును చేశారు.. ముగ్గురిపై వేటు
కర్ణాటక కాలేజీ వాష్‌రూమ్‌లో విద్యార్థిని వీడియో తీసినందుకు ముగ్గురు బాలికలపై అభియోగాలు మోపారు. వీడియో రికార్డు చేసిన ముగ్గురు విద్యార్థినులను కాలేజీ నుంచి సస్పెండ్ చేశారు. ఉడిపిలోని పారామెడికల్ కాలేజీకి చెందిన ముగ్గురు విద్యార్థినులు ఇటీవల కాలేజీ వాష్‌రూమ్‌లో తమ తోటి విద్యార్థిని వీడియో తీసిన ఆరోపణలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
ఉడిపిలోని మల్పే పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. షబ్నాజ్, అల్ఫియా, అలీమా అనే ముగ్గురు విద్యార్థులను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. ఐటీ చట్టంలోని సెక్షన్ 509, 204, 175, 34, 66 (ఇ) కింద నమోదైన ఎఫ్‌ఐఆర్‌లో కాలేజీ అడ్మినిస్ట్రేషన్ పేరు కూడా ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
నేత్ర జ్యోతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ వాష్‌రూమ్‌లో వీడియో రికార్డింగ్‌కు సంబంధించి రెండు వేర్వేరు సూమోటో కేసులు నమోదు చేసినట్లు పోలీసు ప్రకటన తెలిపింది.
ఒక విద్యార్థిని ప్రైవేట్ వీడియోను రికార్డ్ చేసి, దానిని తొలగించినందుకు ముగ్గురు విద్యార్థినులు, కళాశాల యాజమాన్యంపై కేసు నమోదు చేయడం జరిగింది. బాధితురాలి ప్రతిష్టను దెబ్బతీసేలా ఘటనకు సంబంధించిన వివరాలు, ఆధారాలు సమర్పించడంలో విఫలమయ్యారని పోలీసులు వారిపై అభియోగాలు మోపారు. ఈ ఘటనకు సంబంధించిన మార్ఫింగ్ వీడియో ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేయడం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.